Pooja Hegde: పూజా హెగ్డే ఈజ్ బ్యాక్.. బాలీవుడ్ అవకాశాలు కొట్టేసిన ముద్దుగుమ్మ?

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 12:30 PM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన పూజా హెగ్డే ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయిందని చెప్పవచ్చు. అందుకు గల కారణం ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవడం. ఇకపోతే పూజా హెగ్డే చివరగా విడుదలైన కిసికా భాయ్ కిసికా జాన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది. ఈ సినిమా కంటే ముందు విడుదలైన బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్యా సినిమాలు ఫ్లాప్ అవడంతో పూజా హెగ్డే కెరియర్ కాస్త డల్ అయ్యింది. దాంతో ఐరన్ లెగ్ అంటూ పూజ హెగ్డే ని విమర్శించడం మొదలుపెట్టారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. అప్పుడప్పుడు పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటుంది పూజా హెగ్డే. అయితే సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. పూజా హెగ్డేకు మళ్ళీ అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ సినిమాలు అని తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ లో ఒక సినిమా చేసి అక్కడి నుంచే వచ్చిన ఈ బుట్టబొమ్మ మళ్ళీ అక్కడికి వెళ్లి రెండు సినిమాలు చేయగా అవి కాస్తా ఫ్లాప్ అయింది. బాలీవుడ్ లో తెగ అవకాశాలు వచ్చేస్తాయని, డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదని మహేష్ బాబు గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా వదిలేసుకొని మరీ వెళ్లిందని సమాచారం.

తీరా అక్కడికి వెళ్ళాక పరిస్థితి అంతా మారిపోయింది. సల్మాన్ తో చేసిన సినిమా రిలీజయిన దగ్గర్నుంచి అమ్మడికి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఇటు టాలీవుడ్ లో కూడా ఎవ్వరూ పిలవలేదు. ఆఖరికి వెబ్ సిరీస్ లు కూడా చేద్దామని ఫిక్స్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. చేతిలో సినిమాలేమి లేకుండా ఒక సంవత్సరం గడిపేసింది పూజా. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా పూజా హెగ్డేకి ఒకేసారి బాలీవుడ్ లో మూడు ఆఫర్లు వచ్చినట్టు సమాచారం. షాహిద్ కపూర్ తో దేవా అనే సినిమాలో నటిస్తుంది పూజ హెగ్డే. ఈ సినిమా దసరాకి రిలీజ్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతోంది. దీని తర్వాత బాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న కార్తీక్ ఆర్యన్ తో ఒక సినిమా ఓకే అయిందని సమాచారం.

అలాగే అహాన్ శెట్టి సరసన ఒక సినిమా ఓకే చేసింది. ఈ సినిమా వచ్చే సంవత్సరం వాలెంటైన్స్ డేకి వస్తుందని తెలుస్తుంది. దీంతో పూజా చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. పూజా హెగ్డే మళ్ళీ గతంలో లాగా బిజీ అవ్వాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ మూడు సినిమాలు తప్పకుండా హిట్ అయితే మళ్లీ పూజ హెగ్డే ఫామ్ లోకి రావడం ఖాయం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ ఇవ్వడంతో పూజ హెగ్డే అభిమానులు పూజా ఇస్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.