Pooja Hegde : అలా డిసైడ్ అయిన పూజా హెగ్దే.. కెరీర్ లో ఫస్ట్ టైం..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde) కెరీర్ డైలమాలో పడింది. అమ్మడు మొన్నటిదాకా తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉండగా

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde about Surya Retro Movie Chance

Pooja Hegde about Surya Retro Movie Chance

బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde) కెరీర్ డైలమాలో పడింది. అమ్మడు మొన్నటిదాకా తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఒక్కసారిగా అవకాశాల్లేక ఖాళీ అయిపోయింది. దీని వెనుక కారణాలు ఏంటన్నది తెలియదు కానీ పూజా హెగ్దే మాత్రం ఈ గ్యాప్ ని ఎంజాయ్ చేస్తుందని తెలుస్తుంది. బాలీవుడ్ సినిమాల వల్లే తెలుగు సినిమాలకు దూరం అవుతుందని వార్తలు వచ్చినా అక్కడ కూడా అంత సీన్ లేదని తెలుస్తుంది.

ఇక ఫ్రీ టైం లో తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కి క్రేజీ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది పూజా. ఇదిలాఉంటే లేటెస్ట్ గా అమ్మడికి వెబ్ సీరీస్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో ఈ వెబ్ సీరీస్ వస్తుంది. ఈ సీరీస్ ను నెట్ ఫ్లిక్స్ వారు నిర్మిస్తారని తెలుస్తుంది.

డిమాంటో కాలనీ, ఇమైక్క నోడిగల్, కోబ్రా సినిమాలను డైరెక్ట్ చేసిన అజయ్ జ్ఞానముత్తు హార్రర్ థ్రిల్లర్ జోనర్ లో ఈ వెబ్ సీరీస్ చేస్తారని తెలుస్తుంది. పూజా డిజిటల్ ఎంట్రీ కోసం నెట్ ఫ్లిక్స్ భారీగా రెమ్యునరేషన్ అందిస్తున్నారని తెలుస్తుంది. తెలుగులో మరో అవకాశం కోసం చూస్తున్న పూజా హెగ్దే నాని నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్.

Also Read : Shruthi Hassan : శృతి హాసన్ కి కలిసి వచ్చిన 2023..!

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 25 Dec 2023, 01:29 PM IST