హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ (Krish).. పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన్ను విచారించిన పోలీసులు శాంపిల్స్ (Drug Test) సేకరించారు. క్రిష్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. ఒకవేళ, టెస్టులో పాజిటివ్ గా తేలితే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూరిన్ టెస్ట్ లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తెలియాల్సి ఉంది. ఇవాళ సాయంత్రానికి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. డ్రగ్ టెస్టులో నెగటివ్ రిపోర్ట్ వచ్చినా…సాక్షి కింద మరోసారి ఆయనను విచారణకు పిలవనున్నట్లు సమాచారం.
మరోవైపు, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న దర్శకుడు క్రిష్ పిటిషన్ పై వివరణ ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. జస్టిస్ జి.రాధారాణి దీనిపై విచారణ చేపట్టగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసులో మొదటి నిందితుడైన వివేకానంద ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్ ను పదో నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారన్నారు. దర్యాప్తునకు అవసరమైనప్పుడు పిటిషనర్ హాజరవుతారని, కోర్టు విధించే షరతులకు లోబడి ఉంటారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసులను వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేశారు.
We’re now on WhatsApp. Click to Join.
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు.. పోలీసులు క్రిష్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ డ్రగ్స్ కేసులో మొత్తం 12 మంది పేర్లను FIRలో చేర్చారు. ఇప్పటికే డ్రగ్ సప్లేయర్ అబ్బాస్, డ్రగ్ పెడ్లర్ వహీద్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణకు హాజరుకాని వారికి నోటీసులు జారీ చేశారు.
Read Also : MallaReddy : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ ..
