బిగ్‌బాస్ సీజన్ 7(Bigg Boss 7) నిన్నటితో పూర్తయి విన్నర్ గా పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడూ జరగనంత రచ్చ ఈ సారి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అతని మనుషులు చేశారు. నిన్న రాత్రి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ తమ కార్స్ లో బయటకి రాగా ప్రశాంత్ అభిమానులు వారి కార్లపై దాడి చేసి, కార్ అద్దాలు పగలకొట్టారు. బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తించారు.
పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ .. అమర్ దీప్, గీతూ రాయల్, అశ్విని, హర్ష కార్లని పగలకొట్టారు. వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులను భయపెట్టారు. గవర్నమెంట్ బస్ అద్దాలు కూడా పగలకొట్టారు. ఇప్పటికే దీనిపై తెలంగాణ RTC ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియో బయట ప్రశాంత్ అభిమానులు నానా రచ్చ చేసి చాలామందికి ఇబ్బంది కలిగించారు. తాజాగా ఈ గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిన్న రాత్రి జరిగిన ఘటనపై ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసినందుకు గాను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ పై కూడా పోలీసులు(Police) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఆరు బస్సులు, ఓ పోలీస్ వాహనం, రెండు ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేశారు. సీసీ ఫుటేజీ, వీడియోలో వచ్చిన ఆధారాలతో నిందితులను గుర్తించి దాడులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేస్తాం అని తెలిపారు పోలీసులు.
Also Read : Bigg Boss 7 Telugu: ‘బిగ్’ రగడ.. అమర్‌దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి