Dimple Hayathi : డింపుల్ హయతిపై కేసు.. డింపుల్ వర్షన్ ఏంటి? లీగల్ గా ఫైట్ చేస్తాం అంటున్న లాయర్..

డింపుల్ హయతి గొడవ కాస్తా మీడియాకు ఎక్కడంతో తాజాగా డింపుల్ లాయర్ మీడియాతో మాట్లాడారు.

  • Written By:
  • Publish Date - May 23, 2023 / 06:00 PM IST

ఇవాళ ఉదయం నుంచి హీరోయిన్ డింపుల్ హయతి(Dimple Hayathi) ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. తాను నివాసం ఉండే అపార్ట్మెంట్స్ లోనే హైదరాబాద్(Hyderabad) ట్రాఫిక్ విభాగంలో DCP గా పనిచేసే ఓ IPS ఆఫీసర్ నివాసం ఉంటున్నాడు. పార్కింగ్ స్థలం విషయంలో అతని డ్రైవర్ తో గొడవ పడుతుందని, అతను ఉపయోగించే ప్రభుత్వ కారుని కాలితో తన్నింది, తన కారుతో ఢీ కొట్టి డ్యామేజ్ చేసిందని.. IPS ఆఫీసర్ కార్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్, ఆ IPS ఆఫీసర్ ఎంత చెప్పినా, పద్దతిగా మాట్లాడాలని చూసినా డింపుల్ వినలేదని పలు మార్లు గొడవ పెట్టుకుందని ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు డింపుల్, డింపుల్ తో పాటు నివసించే అతని బాయ్ ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ లపై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కి పిలిపించి హెచ్చరించారు. డింపుల్ కూడా తనదేమి తప్పులేదని ఆ IPS ఆఫీసర్ మీద కేసు పెట్టబోతే పోలీసులు తీసుకోలేదు. దీంతో పవర్ ఉందని తప్పులు చేస్తున్నారు అంటూ ట్వీట్ చేసింది డింపుల్. ఈ గొడవ కాస్తా మీడియాకు ఎక్కడంతో తాజాగా డింపుల్ లాయర్ మీడియాతో మాట్లాడారు.

 

డింపుల్ లాయర్ పాల్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. డింపుల్ హయతిపై తప్పుడు కేసు పెట్టారు. రోడ్ మీద ఉండే సిమెంట్ బ్రిక్స్ ప్రైవేట్ అపార్ట్మెంట్ లోకి వచ్చాయి. వాటిని అడ్డంగా పెట్టారు. ఇదే విషయాన్ని హీరోయిన్ 2 నెలలుగా అడుగుతుంది. డింపుల్ తో డీసీపీ చాలాసార్లు రాష్ గా మాట్లాడారు. డింపుల్ పార్కింగ్ ప్లేస్ లో కోన్స్ పెట్టారు. డింపుల్ ఒక సెలబ్రిటీ. చాలాసార్లు చెప్పినా వినకపోవడంతోనే అసహనంతో కోన్స్ ని కాలుతో తన్నారు. DCP పై డింపుల్ కేసు పెడతాను అని బెదిరించడంతో ఉల్టా డింపుల్ పై కేసు పెట్టారు. ఆమెను వేధించాలి అనేదే ఆ DCP ఉద్దేశం. అయినా DCPకి ప్రభుత్వ క్వార్టర్స్ ఇచ్చినా అక్కడ ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉన్నారు? DCPనే ప్రభుత్వ ప్రాపర్టీ ని మిస్ యూజ్ చేస్తున్నారు. ఒక డీసీపీ స్థాయి వ్యక్తి ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? అమ్మాయి మీదకి వెళ్ళి మాట్లాడతారా? ఒక సెలబ్రిటీగా, ఒక అమ్మాయిగా అందులోనూ పోలీస్ ఆఫీసర్ పై కేసు పెట్టేందుకు వెనుకాడింది. కానీ ఆ ఐపీఎస్ తన డ్రైవర్ తో కేసు పెట్టించారు. డింపుల్ ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు తీసుకోలేదు. 4 గంటలు పోలీస్ స్టేషన్ లోనే కూర్చోపెట్టారు. దీనిపై మేము లీగల్ గా ఫైట్ చేస్తాం అని అన్నారు. ఈ కేసు ఇప్పుడు చర్చగా మారింది. ఇంకెంత దూరం తీసుకెళ్తారో చూడాలి ఈ కేసుని.

 

Dimple Hayathi: ఐపీఎస్ కారుపై దాడి.. హీరోయిన్ డింపుల్ పై పోలీస్ కేసు!