Site icon HashtagU Telugu

Pepper-Spray :’పుష్ప-2′ థియేటర్లో పెప్పర్ స్ప్రే కలకలం..

Pepper Spray In 'pushpa 2'

Pepper Spray In 'pushpa 2'

‘పుష్ప-2’ సినిమా థియేటర్‌ (Pushpa 2 )లో స్క్రీనింగ్ జరుగుతున్న సమయంలో పెప్పర్ స్ప్రే (Pepper-Spray) ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన ముంబై బాంద్రా గెలాక్సీ థియేటర్‌(Mumbai Gaiety Galaxy theatre )లో జరిగింది. ఇంటర్వెల్ తర్వాత అజ్ఞాత వ్యక్తి రసాయనాన్ని స్ప్రే చేయగా, ప్రేక్షకులు దగ్గు, ఊపిరితిత్తుల ఇబ్బందులతో బాధపడ్డారు. వెంటనే థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శనను 15 నిమిషాల పాటు నిలిపివేశారు.

ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణను ప్రారంభించారు. ప్రస్తుతానికి ఈ ఘటనను ఎవరు, ఏ ఉద్దేశ్యంతో చేయించారన్నది ఇంకా స్పష్టత రాలేదు. పోలీసుల తెలిపిన దాని ప్రకారం..దుండగుడు ఉపయోగించినది పెప్పర్ స్ప్రే అయి ఉండొచ్చని ప్రాథమిక నిర్ధారణ చేస్తున్నారు. ఇది ఒక రసాయన గ్యాస్ స్ప్రేగా భావిస్తున్నారు. దీని వలన ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. సినిమాను తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులపై ఇలాంటి చర్యకు పాల్పడటం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. థియేటర్ యాజమాన్యం భద్రతా చర్యల లోపం వల్లే ఇది జరిగిందని ప్రేక్షకులు అంటున్నారు.

ఇక పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ (Pushpa 2 First Day Collections) చూస్తే..

ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే హవా చూపిన ఈ సినిమా తొలి రోజు వరల్డ్​వైడ్​గా రూ.175 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్‌ వర్గాలు అంచనా. అయితే ఈ కలెక్షన్స్​లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అమెరికాలో ఈ సినిమా ఫస్ట్ డే సుమారు 4.2 మిలియన్ల డాలర్లు (రూ.35 కోట్లకు పైన) కలెక్షన్ సాధించినట్లు నిర్మాణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా షేర్ చేసింది. అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రం ‘పుష్ప 2’ అనే క్యాప్షన్ దానికి జోడించింది.

డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీ ని తెరకెక్కించగా… నేషనల్ క్రష్​ రష్మిక ఈ చిత్రంలో శ్రీ వల్లి అనే పాత్రలో కనిపించగా.. మాలీవుడ్​ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ భన్వర్​లాల్ షెకావత్​గా అలాగే సీనియర్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్​లు స్ట్రాంగ్​ క్యారెక్టర్లలో కనిపించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందించగా… మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​పై రవి శంకర్, నవీన్ ఈ సినిమాకు సంయుక్తంగా నిర్మించారు.

Read Also : Congress Govt : రేవంత్ పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తుంది – హరీష్ రావు