Peda Kapu: పొలిటికల్ ఎలిమెంట్స్ తో ‘పెద కాపు-1’.. ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్!

టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిశితంగా గమనిస్తే ఈ మూవీ తాజా ఏపీ రాజకీయాలకు అద్దం పడుతుందని చెప్పక తప్పదు.

Published By: HashtagU Telugu Desk
Peda Kapu

Peda Kapu

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన కొత్త సినిమాతో విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇవాళ శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పెద కాపు-1 అనే టైటిల్ ఎ కామన్ మ్యాన్స్ సిగ్నేచర్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తుంది. పోస్టర్‌లో జనసమూహంలో ఎవరో ఒకరు భయంకరమైన రూపంతో కనిపించే కథానాయకుడి చేయి పైకెత్తుతున్నట్టు చూడొచ్చు. ఈ సినిమాలో పొలిటికల్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న విరాట్ కర్ణ చింపిరి జుట్టు, గుబురు గడ్డంతో గంభీరమైన లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది అతని మొదటి సినిమా అయినప్పటికీ, పాత్రకు తగినట్లుగా కనిపిస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ నవతరం థ్రిల్లర్‌ షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిశితంగా గమనిస్తే తాజా ఏపీ రాజకీయాలకు అద్దం పడుతుందని చెప్పవచ్చును.

Also Read: Dubai house wife: వామ్మో.. షాపింగ్ కోసం రోజుకు 70 లక్షలు ఖర్చు చేస్తున్న దుబాయ్ హౌజ్ వైఫ్!

  Last Updated: 02 Jun 2023, 12:30 PM IST