పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు పాన్ ఇండియా స్థాయిలో జూలై 24న విడుదల కాబోతోంది. మొదట ఈ సినిమాకు క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించగా, అనంతరం జ్యోతికృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఫస్ట్ పార్ట్ “స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” పేరుతో విడుదలవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రావడం, అలాగే భారీ బడ్జెట్‌లో రూపొందడం విశేషం. సినిమా షూటింగ్, రాజకీయ షెడ్యూల్స్ మధ్య సమయం కేటాయించడంలో ఎదురైన సవాళ్లతో పాటు వీఎఫ్ఎక్స్ జాప్యాల కారణంగా ఇది ఇప్పటికే పలు మార్లు వాయిదా పడింది.
PM Modi : 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేసాం..అది భారత సైన్యం అంటే – మోడీ
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన గ్రాండ్ ప్రెస్‌మీట్(Hari Hara Veera Mallu Press Meet)లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇది తన సినిమా జీవితంలో మీడియాతో మాట్లాడిన తొలి అనుభవమని పేర్కొంటూ, పోడియం లేకుండా మాట్లాడడం కూడా కష్టంగా ఉందన్నారు. సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో తనకు తెలియదని అన్నారు. ఈ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేసిన ఏఎం రత్నం గురించి ప్రస్తావిస్తూ, “రీజినల్ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన మేధావి ఆయన” అంటూ ప్రశంసించారు. సినిమాను రూపొందించాలంటే ఎంతో సమర్పణ అవసరమని, ఇది సాధారణ పని కాదని చెప్పారు.
తాను యాక్సిడెంటల్ యాక్టర్‌ని, గత్యంతరంలేక సినిమాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజకీయ బాధ్యతల కారణంగా సినిమాలకు కొంతకాలంగా దూరమయ్యానని, అయితే రత్నం అడిగినప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధమయ్యానన్నారు. తన వంతు శ్రద్ధను ఈ సినిమా కోసం పూర్తిగా వెచ్చించానని చెప్పాడు. క్లైమాక్స్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా 57 రోజులు సమయం కేటాయించానని వివరించారు. “సినిమా నాకు ప్రాణవాయువు లాంటిది.. నన్ను బ్రతికించిందీ సినిమానే. నాకు అన్నం పెట్టింది చిత్రసీమే” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
HHVM : మైత్రి చేతికి వీరమల్లు నైజాం రైట్స్..ఉత్తరాంధ్ర రికార్డ్స్
దర్శకుడు క్రిష్‌తో ఉన్న మొదటి విజన్ గురించి ప్రస్తావించిన పవన్, అతడి కథ నచ్చడంతో ఒప్పుకున్నానని చెప్పారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వివరించారు. షూటింగ్‌కు రోజుకి రెండు గంటల సమయం మాత్రమే ఇవ్వగలిగానని, ఓ దశలో గోడౌన్‌లో కూడా షూట్ చేశామని చెప్పారు. సినిమా ఎంత హిట్ అవుతుంది, ఎంత కలెక్షన్లు వస్తాయన్నది తాను ఊహించలేనని, ఆ నిర్ణయం ప్రేక్షకులదే అని అన్నారు. ఈ సినిమా ఒక అనాథ కాదని, దీనికి తనకు సంబంధించిన బాధ్యతను పూర్తిగా నిర్వహించానని పవన్ స్పష్టం చేశారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ వేరు చేయడం తనకు నచ్చదని పవన్ కల్యాణ్ అన్నారు.