BRO Looks: లుంగీ గెటప్ లో పవన్, సాయిధరమ్ తేజ్, వింటేజ్ లుక్స్ అదుర్స్

పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లుంగీ గెటప్ లో కనిపిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
BRO Movie Run Time

Bro

సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. ఆయన నుంచి ఏదైనా వస్తుందంటే ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతుంటాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ‘బ్రో ది అవతార్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు. ఈ చిత్రం వచ్చే నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ప్రొమోషన్స్ ఇంకా ప్రారంభించలేదని, టీజర్ ఇంకా విడుదల కాలేదని అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఎట్టకేలకు అభిమానుల ఎదురు చూపులకు తెరపడింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అప్డేట్ ని మరి కాసేపట్లో ఇవ్వబోతుంది మూవీ టీం. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు సముద్ర ఖని కాసేపటి క్రితమే ఒక పోస్టర్ ని విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లుంగీ గెటప్ లో కనిపిస్తూ స్టైల్ గా నిల్చున్న ఫోజు అభిమానులకు మెంటలెక్కిపోయేలా చేసింది. పవన్ కళ్యాణ్ లుక్ ని చూడగానే అభిమానులు ఒక్కసారిగా తమ్ముడు చిత్రం రోజులకు వెళ్లిపోయారు. ఆ సినిమాలో ‘వయ్యారి భామ నీ హంస నడక’ అనే పాట అప్పట్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ అభిమానులు వింటేజ్ పవన్ ను గుర్తు చేసుకుంటూ మురిసిపోతున్నారు.

Also Read: Drug Case: డ్రగ్స్ తో సంబంధం లేకపోయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: అశురెడ్డి

  Last Updated: 27 Jun 2023, 04:13 PM IST