Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యాక్షన్ ఎంటర్టైనర్‌లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 2012లో విడుదలైన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ విజయవంతమైన జోడీ మళ్లీ కలవడం వల్ల, అభిమానుల్లో ఆసక్తి , అంచనాలు మరింత పెరిగాయి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయపరమైన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, సినిమాల పట్ల ఉన్న ఆయన అంకితభావం ఏమాత్రం తగ్గలేదని ఈ చిత్రం నిరూపిస్తోంది. క్యాబినెట్ సమావేశాలు, హరి హర వీరమల్లు ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమాలు, రాజకీయ వ్యాపారత బిజీ షెడ్యూల్ మధ్యలోనూ పవన్ తన సినిమాకి సమయం కేటాయించడం, అభిమానులను స్ఫూర్తి పరుస్తోంది.
తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్లైమాక్స్ చిత్రీకరణను పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రానికి హైలైట్ అవుతుందని, భావోద్వేగాలు, యాక్షన్ సమ్మేళనంగా ఉండేలా దర్శకుడు హరీష్ శంకర్ శ్రద్ధ వహించారని సమాచారం. ఈ సన్నివేశాలను ప్రసిద్ధ ఫైట్ మాస్టర్ నబకాంత శక్తివంతమైన కొరియోగ్రఫీతో రూపొందించారు. పవన్ కళ్యాణ్ ఈ సన్నివేశాల్లో చూపిన డెడికేషన్, ఎనర్జీ బృంద సభ్యులను విశేషంగా ఆకట్టుకుంది.
షూటింగ్ పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ నబకాంత మాస్టర్ మరియు మొత్తం ఫైట్ టీమ్‌తో ఫోటోలు దిగారు. సీక్వెన్స్ విజయవంతంగా పూర్తి కావడానికి కష్టపడ్డ అందరికీ పవన్ వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలిపారు.
Nimisha Priya : నిమిష ప్రియ మరణశిక్ష కేసు మళ్లీ మలుపు..ఉరిశిక్ష రద్దు కాలేదని కేంద్రం స్పష్టం
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ సినిమాను డిజైన్ చేస్తున్నారని మేకర్స్ హామీ ఇస్తున్నారు.
ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. వీరిద్దరి పాత్రలు కథలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పబడుతోంది. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, రాంకీ, నాగ మహేష్, టెంపర్ వంశీ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శక్తివంతమైన నటీనటుల బృందం, పవర్ స్టార్ ఇమేజ్, హరీష్ శంకర్ మాస్ ఎంటర్టైన్మెంట్ మంత్రం కలిసే ఈ చిత్రం, విడుదలకు ముందే టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది.
పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలు, సినిమాల షూటింగ్‌ల మధ్య సమతుల్యతను పాటించడం ఆయన వర్క్ ఎథిక్‌కు నిదర్శనం. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ మాస్ లుక్‌లో, పవర్‌ఫుల్ డైలాగ్‌లతో తెరపై కనిపిస్తారని చిత్ర బృందం వెల్లడిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, మోషన్ పోస్టర్స్ ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాయి.
Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. పోలవరం వద్ద కూడా