Site icon HashtagU Telugu

Pawan Kalyan-Trivikram : పవన్ కళ్యాణ్.. త్రివిక్రం.. గ్యాప్ వచ్చిందా.. ఇచ్చారా..?

Pawan Kalyan Trivikram Un Expected Gap Between Them

Pawan Kalyan Trivikram Un Expected Gap Between Them

Pawan Kalyan-Trivikram రాజకీయాల పరంగా ఏమో కానీ సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా సరే అందులో త్రివిక్రం ప్రమేయం ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. పవన్ దగ్గరకి ఏ సినిమా గురించి అయినా ప్రస్తావన తీసుకు రావాలన్నా సరే అది త్రివిక్రం ద్వారా అయితేనే కుదురుతుంది.

We’re now on WhatsApp : Click to Join

వాళ్లిద్దరి మధ్య స్నేహం అలా బలపడింది. రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న పవన్ సినిమాల పరంగా బాధ్యత అంతా కూడా గురూజీకి అప్పచెప్పేశాడు. అందుకే పవన్ సినిమా అంటే త్రివిక్రం పక్కన ఉంటున్నాడు.

పవన్ చేసే రీమేక్ లు అయినా.. స్ట్రైట్ సినిమాలు అయినా పవన్ అంటే త్రివిక్రం ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం వాళ్లిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని తెలుస్తుంది. అదేంటి అంటే పవన్ చేస్తున్న OG, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 3 సినిమాలు త్రివిక్రం తో టచ్ లేనివే.. పవన్ సినిమా అంటే తను ఓ చేయి వేసే త్రివిక్రం ఈ సినిమాలకు ఆయన అవసరం లేకుండాపోయింది. అందుకే ఆ సినిమాల కోసం త్రివిక్రం పనిచేయట్లేదు

ఇదిలాఉంటే ప్రస్తుతం పవన్ ఫోకస్ మొత్తం ఆంధ్రా ఎలక్షన్స్ మీద ఉంది. అందుకే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు పవన్ తో త్రివిక్రం కు.. త్రివిక్రం తో పవన్ కి పనిలేదు. ఎప్పుడైనా కలిస్తే వీకెండ్ అలా కలవొచ్చు. మరీ అంత అర్జెంట్ అయితే ఫోన్ లో మాట్లాడొచ్చేమో కానీ ఇద్దరు కలిసి చర్చించే మ్యాటర్స్ ముఖ్యంగా సినిమా విషయాలు ఏమి లేవు.

అందుకే పవన్ త్రివిక్రం ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నారని అంటున్నారు. గ్యాప్ వచ్చిందా వాళ్లే తీసుకున్నారా అన్నది తెలియదు కానీ వీళ్లిద్దరు కాస్త డిస్టన్స్ లో ఉన్నారన్నది లేటెస్ట్ టాక్.

Also Read : Bobby Deol in NBK109 బాబీకి తో బాబీ.. బాలయ్య 109లో యానిమల్ విలన్ ఢీ..!