Pawan-Sreeleela: శ్రీలలకు బంపరాఫర్.. యంగ్ బ్యూటీతో పవన్ రొమాన్స్!

అందానికి అందం, నటనకు నటన రెండు తోడు కావడంతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీలీల.

Published By: HashtagU Telugu Desk
Sreelela And Pawan

Sreelela And Pawan

ధమాకా బ్యూటీ శ్రీలీల (Sreeleela) జట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. అందానికి అందం, నటనకు నటన రెండు తోడు కావడంతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ మరో బంపరాఫర్ కొట్టేసింది. ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. వచ్చే నెల నుంచి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో కలిసి షూటింగ్ లో పాల్గొంటుంది ఈ బ్యూటీ. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు పవన్ కల్యాణ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలోనే పవన్ సరసన హీరోయిన్ గా నటించనుంది శ్రీలీల (Sreeleela) .

నిజానికి ఈ ప్రాజెక్టులో పవన్ సరసన పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నాడు దర్శకుడు. ఎందుకంటే, హరీశ్ కు పూజాహెగ్డే అంటే సెంటిమెంట్. అయితే పూజా మాత్రం కాల్షీట్లు కేటాయించలేకపోయింది. దీంతో శ్రీలీల (Sreeleela)కు అవకాశం దక్కింది. తాజాగా ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది శ్రీలీల. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. విచిత్రం ఏమిటంటే.. పెళ్లిసందD సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలతో దూసుకుపోతుంటే.. మరోవైపు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా అవకాశాలను అందిపుచ్చుకోవడం వెనుకబడిపోయాడు.

Also Read: Vijay Deverakonda: ఫ్యాన్స్ కు మరిచిపోలేని జ్ఞాపకాలు అందించిన హీరో విజయ్ దేవరకొండ!

  Last Updated: 28 Feb 2023, 04:33 PM IST