Site icon HashtagU Telugu

Vasuki : 25 ఏళ్ళ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ సోదరి..

Pawan Kalyan Tholiprema actress Vasuki re entry in movies

Pawan Kalyan Tholiprema actress Vasuki re entry in movies

తొలిప్రేమ(Tholi Prema) సినిమాలో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) కి చెల్లెలిగా నటించిన వాసుకి(Vasuki) అందరికి గుర్తు ఉంటుంది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు వాసుకి అందులో పవన్ సోదరిగా మంచి పాత్రలో మెప్పించారు. ఆ సినిమా తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని(Anand Sai) ప్రేమించి పెళ్లాడింది వాసుకి. ఆనంద్ సాయి పవన్ కు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో వీరిద్దరి పెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గరుండి చేశాడు. పెళ్లి తర్వాత నుంచి వాసుకి సినిమాలకు దూరమైంది.

ఇప్పుడు మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత వాసుకి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అన్నీ మంచి శకునములే’ సినిమా మే 18న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో వాసుకి సంతోష్ శోభన్ కి అక్కగా నటించింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వాసుకి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలను తెలిపింది.

వాసుకి మాట్లాడుతూ.. తొలిప్రేమ తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను. నేను మల్టీటాస్కర్ కాదు. అందుకే సినిమాలు చేయాలనుకోలేదు. ఇప్పుడు పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. నాకు ఖాళీ దొరికింది. అందుకే మళ్ళీ సినిమాల్లోకి వచ్చాను. నేను సినిమాలకు దూరంగా ఉన్నా ఆనంద్ వల్ల ఇంట్లో ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూనే ఉంటాము. నిర్మాత స్వప్న ఈ కథ వినమని నందిని రెడ్డిని పంపించింది. కథ విన్నాక ఇలాంటి మంచి ఫ్యామిలీ కథలు వచ్చి చాలా రోజులైంది కదా అనిపించి ఓకే చెప్పేశాను. తొలిప్రేమలో పవన్ కి సోదరిగా నటించాను. ఇందులో కూడా సంతోష్ శోభన్ కి అక్క గా నటించాను. ఇకపై కూడా ఇలాంటి మంచి కథలు వస్తే కచ్చితంగా సినిమాలు చేస్తాను. మా ఆయన దేనికి నో చెప్పరు, ఇప్పటికి పవన్ గారితో మాకు మంచి బంధం ఉంది అని తెలిపింది. దీంతో పవన్ అభిమానులు వాసుకిని మరోసారి తెరపై చూడటానికి రెడీ అయిపోయారు.

 

Also Read :  NBK108 Update: బాలయ్య కోసం బాలీవుడ్ విలన్.. క్రేజీ అప్‌డేట్ ఇదిగో!

Exit mobile version