Pawan Kalyan : షూటింగ్ మొదలుపెట్టిన OG.. ఈ వీడియో చూశారా?? పవన్ ఫాన్స్ కు పూనకాలే..

సాహో సినిమా తెరకెక్కించిన సుజిత్ దర్శకత్వంలో ఆస్కార్ తెచ్చిన RRR లాంటి సినిమాను తెరకెక్కించిన DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో They call him OG సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan They Call Him OG Movie Shoot starts in Mumbai

Pawan Kalyan They Call Him OG Movie Shoot starts in Mumbai

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ తో బిజీ ఉన్నారు. ఇన్నాళ్లు రాజకీయంగా బిజీగా ఉండటంతో సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోయారు. కానీ వరుసగా సినిమాలు ఓకే చేయడంతో ఎలాగైనా 2024 ఎలక్షన్స్ లోపు అన్ని సినిమాల షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయి వరుసగా సినిమా షూట్స్ కు డేట్స్ ఇస్తున్నారు పవన్. దీంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇటీవలే ఒకేసారి 25 రోజులు డేట్స్ ఇచ్చి వినోదాయ సిత్తం రీమేక్ సినిమా షూటింగ్ పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. ఒక వారం రోజుల క్రితమే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇక ఎప్పట్నుంచో సాగుతున్న హరిహరవీరమల్లు సినిమాకు కుదిరినప్పుడల్లా డేట్స్ ఇస్తున్నారు. తాజాగా పవన్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూసే They call him OG సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు.

సాహో సినిమా తెరకెక్కించిన సుజిత్ దర్శకత్వంలో ఆస్కార్ తెచ్చిన RRR లాంటి సినిమాను తెరకెక్కించిన DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో They call him OG సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా ఈ సినిమాపై మాత్రం పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ గా నటించబోతున్నట్టు సమాచారం.

తాజాగా They call him OG సినిమా నుంచి నిర్మాణ సంస్థ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. OG సినిమా షూట్ ఇవాళ్టి నుంచి ముంబైలో మొదలైందని, ప్రస్తుతం పవన్ లేని సీన్స్ ని షూట్ చేస్తున్నామని, వచ్చే వారం నుంచి పవన్ OG సినిమా షూట్ లో జాయిన్ అవుతారని తెలిపింది. ఈ విషయం అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిర్మాణ సంస్థ. దీంతో పాటు ఓ వీడియోని కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో సుజిత్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు, పవన్ ని గ్యాంగ్‌స్టర్ గా ఫుల్ మాస్ లుక్ లో చూపించబోతున్నట్టు, firestorm is coming అంటూ చూపించి సినిమాపై అంచనాలు పెంచారు. దీంతో పవన్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read :     Jio Cinema : జియో సినిమా సరికొత్త ప్లాన్.. IPL ఫ్రీ.. కానీ సినిమాలకు డబ్బులు కట్టాలి..

  Last Updated: 15 Apr 2023, 07:38 PM IST