Site icon HashtagU Telugu

Pawan Kalyan : ఏమున్నాడ్రా బాబు.. OG సెట్ లోకి అడుగు పెట్టిన పవర్ స్టార్..

Pawan Kalyan OG

Pawan Kalyan started They Call Him OG Movie Shooting in Mumbai

పవర్ స్టార్(Power Star) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) 2024 ఎలక్షన్స్ వచ్చే లోపే చేతిలో ఉన్న అన్ని సినిమాలు పూర్తి చేసేయాలని, రాజకీయాలకు టైం కేటాయించాలని డిసైడ్ అయ్యి వరుసగా సినిమాలకు డేట్స్ ఇస్తున్నాడు. ఇటీవలే వినోదయ సిత్తం(Vinodaya Sitham) రీమేక్ సినిమాకు ఒకేసారి 25 రోజులు డేట్స్ ఇచ్చి షూట్ పూర్తి చేసేశాడు. కొన్ని రోజుల క్రితమే ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath Singh) సినిమా షూట్ కూడా మొదలుపెట్టి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసేశాడు.

తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎదురుచూస్తున్న They Call Him OG సినిమా షూట్ కూడా మొదలుపెట్టేశాడు. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న OG సినిమా కొన్ని రోజుల క్రితమే ముంబైలో షూటింగ్ మొదలుపెట్టింది. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ని షూట్ చేశారు. తాజాగా నేడు పవన్ కళ్యాణ్ ముంబైలో జరుగుతున్న OG సినిమా సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి షూట్ లో జాయిన్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గా నడిచి వస్తున్న ఓ ఫోటోని షేర్ షేర్ చేసి చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ సూపర్ గా ఉండటంతో ఏమున్నాడ్రా బాబు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 50 ఏళ్ళ ఏజ్ లో కూడా పవన్ భలే మెయింటైన్ చేస్తున్నాడు అని అంటున్నారు. సెట్ లో పవన్ దర్శకుడు సుజిత్ తో మాట్లాడుతుండగా కొన్ని ఫోటోలని, పవన్ ఎంట్రీ ఇచ్చిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిత్రయూనిట్. OG సినిమా గురించి అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

 

Also Read :    Samantha: శాకుంతలం రిజల్ట్ పై స్పందించిన సమంత.. పోస్ట్ వైరల్?