అభిమానులకు షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. సినిమాల కన్నా సమాజం ముఖ్యం అనీ సినిమాల కన్నా దేశం ఇంకా ముఖ్యం అనీ అన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అన్న పవన్ తాను సినిమాలు, రాజకీయాలను వేరు వేరుగా చూస్తా అన్నారు. ఈయన మాటలు విన్న అభిమానులు ఒకిత్త షాక్ అయ్యారు. చిత్రసీమలో పవన్ కళ్యాణ్ రేంజ్ ఎటువంటిదో చెప్పాల్సిన పనిలేదు.
వరుస ప్లాప్స్ పడినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ రేంజ్ రవ్వంత కూడా తగ్గలేదు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ప్లాప్ అయినప్పటికీ..నిర్మాతలకు కాసుల పంట కురిపిస్తుంటాయి. ఇక రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే పవన్..అవన్నీ వదిలిపెట్టి..ప్రజలకు సేవ చేయాలనీ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్ల తర్వాత అధికారం చేపట్టే ఛాన్స్ వచ్చింది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు ఒకేదెబ్బకు పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించడంతో పాటు డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు. గత 8 నెలలుగా సినిమా షూటింగ్ లకు దూరంగా ఉన్న పవన్..త్వరలోనే సెట్స్ ఫై ఉన్న పలు సినిమాలను పూర్తి చేస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఓ షాకింగ్ విషయాన్నీ చెప్పి షాక్ ఇచ్చాడు.
We’re now on WhatsApp. Click to Join.
నేటి నుండి ఏపీలో ‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో (Grama Sabhalu) గ్రామా సభలు మొదలు అయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన మార్కు పరిపాలనతో దేశచరిత్రలో నిలిచిపోయేలా నేడు రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గ్రామాలకు ఆదాయం.. అభివృద్ధి పెంచేలా ప్రణాళిక రూపొందించేందుకు గ్రామ సభల్లో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులోని మైసూరువారిపల్లిలో జరిగిన గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..సినిమాల కన్నా సమాజం ముఖ్యం అనీ సినిమాల కన్నా దేశం ఇంకా ముఖ్యం అనీ అన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అన్న పవన్ తాను సినిమాలు, రాజకీయాలను వేరు వేరుగా చూస్తా అన్నారు.. దానితో పవన్ ఇక సినిమాలకు పూర్తిగా దూరం జరగనున్నారు అన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. మరి నిజంగా పవన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడా..? లేక ఏదో కామన్ గా ఆలా మాట్లాడి ఉంటాడా అని అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also : Pawan Kalyan : కాసేపట్లో మైసురావారిపల్లెలో పవన్ కళ్యాణ్ సందడి