Pawan Kalyan Raviteja పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మహరాజ్ రవితేజ ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది కదా.. అది కూడా మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ తో కలిసి చేస్తే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. కానీ సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఈ సినిమా చివరకు క్యాన్సిల్ అయ్యింది. కారణాలు ఏంటన్నది తెలియదు కానీ పవన్, రవితేజ కాంబో మల్టీస్టారర్ (Multistarrer) సినిమా మిస్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహరాజ్ రవితేజ ఇద్దరు కలిసి చేస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.
ఐతే ఇది ఇప్పటిది కాదు దాదాపు 20 ఏళ్ల క్రితం మాట. 2004 లో వచ్చిన యువ సినిమా మణిరత్నం మార్క్ మూవీగా వచ్చింది. సూర్య, మాధవన్, సిద్ధార్థ్ కలిసి నటించిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ను మెప్పించింది. ఐతే ఈ సినిమాను తెలుగు రీమేక్ లో పవన్, రవితేజలను నటింపచేయాలని అనుకున్నారు. వాళ్లిద్దరు కూడా దాదాపు సినిమాకు ఓకే చెప్పారట. ఏమైందో ఏమో కానీ లాస్ట్ మినిట్ లో సినిమా రీమేక్ చేయకుండా జస్ట్ డబ్ చేసి వదిలారు.
లాస్ట్ మినిట్ లో..
ఇదే సినిమా హిందీలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ కలిసి చేశారు. అక్కడ కూడా సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఐతే యువ తెలుగు లో పవన్ (Pawan Kalyan), రవితేజ (Raviteja) చేయాల్సి ఉన్నా లాస్ట్ మినిట్ లో సినిమా ఆగిపోయింది. అదే సినిమా చేసి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. సూర్య పాత్రలో పవన్, మాధవన్ రోల్ లో రవితేజ ని తీసుకోవాలని మణిరత్నం అనుకున్నారు.
అలా ఒక పవర్ మాస్ కాంబినేషన్ సినిమా మిస్ అయ్యింది. మళ్లీ అలాంటి కాంబో సెట్ చేయడం ఎవరి వల్లా కాలేదు. బహుశా తర్వాత అవుతుందా లేదా అన్నది కూడా తెలియదు.
Also Read : Vijay Devarakona : కేరళలో టాలీవుడ్ హీరో ఫ్యాన్స్ మీట్..!