గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ (Pawan -Harish Shankar) కలయికలో రాబోతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ధమాకా ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో పున:ప్రారంభమైంది. రీసెంట్ గానే హరిహర వీరమల్లు , ఓజి సినిమాల షూటింగ్ ను కంప్లీట్ చేసిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో అడుగుపెట్టాడు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో యాక్షన్ పార్ట్ తో షూటింగ్ మొదలైనట్లు తెలుస్తుంది.
Rajya Sabha : రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్ హాసన్
ఇప్పటికే పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలతో చాల వరకు షూటింగ్ పూర్తి చేసుకోగా..ఇప్పుడు పవన్ ఎంట్రీ తో జెట్ స్పీడ్ గా మిగతా సన్నివేశాలను పూర్తి చేయాలనీ హరీష్ శంకర్ చూస్తున్నాడు. ఈ షెడ్యూల్ మొత్తం 30 రోజుల పాటు జరగనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ సినిమా కోసం 45 రోజులు డేట్ కేటాయించారు.
CM Revanth Reddy : రాహుల్, ఖర్గేతో రేవంత్ భేటీ.. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ..!
ఇక హరీష్ విషయానికి వస్తే.. షాక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హరీష్ మొదటి సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత చేసిన మిరపకాయ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కి ముందు ఆడియో లాంచ్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయారు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి పంచభూతాలు లాగా పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా శాశ్వతం అని అప్పుడు ఒక మంచి ఎలివేషన్ తన మాటల్లో అందించాడు. ముఖ్యంగా ఆ ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు చేసిన ప్రామిస్ ను చాలా సక్సెస్ఫుల్ గా ఆ సినిమాతో నిలబెట్టుకున్నాడు. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు సినిమా వస్తుంది అంటే అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో కంటెంట్ విపరీతంగా ఆకట్టుకుంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.