Pawan Kalyan: త్రివిక్రమ్ మాటలతో ప్రేక్షకులను మాయ చేస్తూ ఉంటాడు. తన సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తూ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయారు. అయితే ఇటీవల త్రివిక్రమ్ పెన్ను నుంచి వచ్చిన గుంటూరు కారం చిత్రం ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. కలెక్షన్స్ రాబట్టినప్పటికీ మౌత్ టాక్ మాత్రం నెగిటివ్ గానే వినిపించింది.
తాజాగా త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ జనాలకే కాదు.. కామన్ ఆడియన్స్ కు కూడా బాగా తెలుసు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పొలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ గుంటూరు కారం రిలీజ్ చేసి ఇప్పుడు ఎవరితో సినిమా చేయాలా..? అని దీర్ఘంగా ఆలోచనలో ఉన్నాడు.
పవన్ తో చర్చలు జరపడానికి కారణం ఏంటంటే… బ్రో సినిమా తరహా సినిమా ఒకటి చేయమని ఓ ప్రపోజల్ ఒకటి త్రివిక్రమ్ ముందు జీ సంస్థ పెట్టిందట. దీని గురించి మాట్లాడడానికి పవన్ తో చర్చలు జరుపుతున్నాడట. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను కూడా త్రివిక్రమ్ కే అప్పగించారట. ఓ రీమేక్ స్టోరీ, ఓరిజినల్ స్టోరీ రెడీగా ఉన్నాయట. ఈ విషయమై చర్చలు జరిగాయట. అయితే.. పవన్ ఇప్పుడు పొలిటికల్ బిజీ అయిన తర్వాత ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేయాలి. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలు కంప్లీట్ చేయాలి. ఇప్పటికే ఈ సినిమాలు స్టార్ట్ చేసి చాలా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు కనుక గురుజీతో సినిమా చేయడానికి ఓకే చెబితే.. కంప్లీట్ చేయాల్సిన మూడు సినిమాల్లో ఓ సినిమా మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.
మొత్తానికి గురుజీ గుంటూరు కారం తర్వాత ఏం చేయాలి అనే విషయం పై చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారట. పవన్ మాత్రం రాజకీయంగా బిజీ అయిన తర్వాత ఆలోచిద్దామని చెప్పారట. మరో వైపు త్రివిక్రమ్ తో సినిమా చేయడం కోసం రామ్, నాని, విజయ్ దేవరకొండ ప్రయత్నిస్తున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. ఒక నెల తర్వాత త్రివిక్రమ్ నెక్ట్స్ ఏంటి అనేది క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈలోపు గ్యాపిప్ రాయులు ఇష్టమొచ్చినట్టుగా త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఫిక్స్ అయ్యింది అంటూ రకరకాల వార్తలు రాస్తుంటారు. మరి.. త్రివిక్రమ్ ప్రపోజల్ కి పవర్ స్టార్ ఎలా రియాక్ట్ అవుతారో..? ఓకే అంటే కనుక మరో హిట్ ఖాయం అని టాక్.
Also Read: Health Care Tips: ఈ ఫుడ్స్ తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు అస్సలు తాగకండి?