Site icon HashtagU Telugu

Nani : నాని సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజీ..!

Pawan Kalyan OG Surprise in Nani Saripoda Shanivaram

Pawan Kalyan OG Surprise in Nani Saripoda Shanivaram

న్యాచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో వివేక్ అత్రేయ డైరెక్షన్ లో వచ్చిన సినిమా సరిపోదా శనివారం. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియంక మోహన్ హీరోయిన్ గా నటించింది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూడటానికి వెళ్లిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు.

సరిపోదా శనివారం కోసం వెళ్తే సినిమా ఇంటర్వెల్ లో పవర్ స్టార్ OG టీజర్ ని రిలీజ్ చేశారు. అఫ్కోర్స్ అది ఇదివరకు టీజరే అయినా కూడా ఫ్యాన్స్ కి వెండితెర మీద ఓజీ టీజర్ చూసే సరికి సూపర్ కిక్ వచ్చింది. నాని సినిమా చూడటానికి వెళ్తే పవన్ కళ్యాణ్ టీజర్ ఖుషి చేసింది.

ఇక నాని (Nani) సినిమా విషయానికి వస్తే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సరిపోదా శనివారం న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇచ్చింది. సినిమాలో నానికి ఈక్వెల్ గా ఎస్జే సూర్య రోల్ అదిరిపోయింది. విలన్ గా సూర్య ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా అదరగొట్టేశారు. ఇక జేక్స్ బిజిఎం మాత్రం సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్లింది.

లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో హిట్ అందుకున్న నాని సరిపోదా శనివారం (Saripoda Shanivaram) తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. సరిపోదా శనివారం సినిమా ఫస్ట్ డే వసూళ్లు కూడా నాని కెరీర్ బెస్ట్ వచ్చేలా ఉన్నాయి.

Also Read : Saripoda Shanivaram Review & Rating : నాని సరిపోదా శనివారం రివ్యూ & రేటింగ్