Pawan Kalyan OG Official Release Date పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. మొన్న చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ సెప్టెంబర్ 27 రిలీజ్ అని చెప్పారు. లేటెస్ట్ గా నేడు మేకర్స్ మరోసారి ఆ డేట్ ని అనౌన్స్ చేశారు. అతేకాదు రిలీజ్ డేట్ తో కూడిన ఓజీ పోస్టర్ ని కూడా వదిలారు.
పవన్ కళ్యాణ్ ని అల్ట్రా స్టైలిష్ గా చూపిస్తున్న సుజిత్ ఈ సినిమాతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా ఉన్నాడని చెప్పొచ్చు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ కూడా మ్యూజిక్ అందిస్తున్నారు.
ఓజీ సినిమాకు సంబందించి ఆమధ్య వచ్చిన ఒక టీజర్ సినిమాపై అంచనాలు డబుల్ చేసింది. ఓజీ టీజర్ తోనే సర్ ప్రైజ్ చేసిన సుజిత్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడని చెప్పొచ్చు. పవన్ ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. సినిమా రిలీజ్ పోస్టర్ లో కూడా పవన్ లుక్స్ అదిరిపోయింది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సుజిత్ ఫుల్ మీల్స్ పెట్టేందుకు సిద్ధమయ్యాడు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలైతే భారీగా ఉండగా సినిమా ఏ రేంజ్ రికార్డులు సృష్టిస్తుంది అన్నది చూడాలి. ఓజీ సినిమా షూటింగ్ కొంతమేరకు పూర్తి కాగా సినిమాను పూర్తి చేయాలంటే పవన్ మరో 30 రోజుల డేట్స్ ఇవ్వాలని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు హంగ్రీ చీతా అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read : Hrithik Roshan NTR War 2 : రణరంగంలో స్టార్స్ ఫైట్.. వార్ 2 యాక్షన్ సీక్వెన్స్ తోనే స్టార్ట్ చేస్తున్నారట..!