Site icon HashtagU Telugu

Pawan Kalyan OG : ఓజీ వస్తున్నాడు మరి విజయ్ పరిస్తితి ఏంటి..?

Star Hero in Power Star Pawan Kalyan OG

Star Hero in Power Star Pawan Kalyan OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ సినిమా అసలైతే సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. ఐతే ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల పవన్ ఆ సినిమాను పూర్తి చేయలేకపోయారు. ఐతే పవన్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఖాళీ టైం చూసుకుని కమిటైన సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నారు. పవన్ సినిమాల లిస్ట్ లో హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లు ఉన్నాయి.

పవన్ ముందు వీరమల్లు సినిమాను పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఆ తర్వాత ఓజీకి డేట్స్ అడ్జెస్ట్ చేస్తారని టాక్. OG సినిమా నిర్మిస్తున్న డివివి ఎంటర్టైన్మెంట్స్ లేటెస్ట్ గా ఓజీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. 2025 మార్చ్ 27న ఓజీ రిలీజ్ లాక్ చేశారు. ఐతే అదే డేట్ కి విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న VD 12 సినిమాను మార్చి 27న రిలీజ్ లాక్ చేశారు. ఐతే పవర్ స్టార్ ఓజీకి పోటీకి విజయ్ దేవరకొండ రిలీజ్ అవుతుందా లేదా సినిమాకు మరో మంచి రిలీజ్ డేట్ చూస్తారా అన్నది చూడాలి.

నెక్స్ట్ సమ్మర్ లో కూడా భారీ సినిమాలు ఉన్న కారణంగా సినిమాల రిలీజ్ డేట్ లో మరోసారి కన్ ఫ్యూజన్ తప్పేలా లేదు. ఓజీ సినిమా విషయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

Also Read : Saripoda Shanivaram 3 Days Collections : 3 రోజులు 50 కోట్లు.. నాని సరిపోదా కలెక్షన్స్..!