Site icon HashtagU Telugu

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా టైటిల్ ఇదే.. భవదీయుడు భగత్‌సింగ్‌ కాదు.. ఉస్తాద్ భగత్‌సింగ్..!

Cropped

Cropped

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అంటూ ఇప్పటికే టైటిల్‌తో పాటు, పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఈ క్రమంలో ఈ మూవీ టైటిల్‌ను మార్పు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh) అంటూ కొత్త టైటిల్‌, పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్‌ లైన్‌ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ తాజా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

దాదాపు రెండేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా రూపొందనుందని ప్రకటించారు. అయితే దీని చిత్రీకరణ ఎప్పుడో ప్రారంభం కాలేదు. దానిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు పుకార్లు వ్యాపించాయి. అయితే ఈ చిత్రానికి కొన్ని మార్పులు చేసి కొత్త టైటిల్‌ని పెట్టారు. ఆదివారం కొత్త టైటిల్, పోస్టర్ రివీల్ చేశారు. “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) అనేది ఇప్పుడు సినిమా అధికారిక పేరు. పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ తన మోటార్ సైకిల్ పక్కన నిలబడి టి గ్లాస్ పట్టుకున్నట్లు చూపించారు. “పవన్ కళ్యాణ్‌ని ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా చూపించబోతున్నాం. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభమవుతుంది’’ అని మైత్రీ మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేశారు.

Also Read: Web Series : బీహార్ ‘ఖాకీ’ వెబ్ సిరీస్ పేరుతో ఐపీఎస్ అవినీతి..!