టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ వేరే. ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే. ముఖ్యంగా పవన్ అభిమానుల హంగామా అంతా ఇంతా ఉండదు. ఫ్టస్ డే ఫస్ట్ షోకు సినిమా చూసేందుకు ఇంట్రస్ట్ చూపుతారు. హిట్ సినిమా, ఫ్లాప్ మూవీ అయినా పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే కాసుల వర్షం కురిపించగలదు. బాక్సాఫీస్ ను షేక్ చేయగలడు. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ హీరోగా ఎస్‌జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఖుషి’ (Kushi) 2001లో విడుదలై ఘనవిజయం సాధించింది.
రీరిలీజ్ ట్రెండ్‌లో భాగంగా ఈ సినిమాను శనివారం విడుదల చేశారు. దీంతో హైదరాబాద్ (Hyderabad) ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్‌కు ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు. అభిమానుల రాకతో ఆర్టీసీ క్రాస్ రోడ్ సందడిగా మారింది. ఖుషి సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్స్ కూడా పవన్ ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఖుషి చిత్రాన్ని 4కె ప్రింట్ లో రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రి రిలీజ్ చేస్తున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్ లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో జల్సా చిత్రాన్ని ఖుషి నైజాం ఏరియాలో అధికమించింది. జల్సా 1. 25 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టగా.. ఖుషి చిత్రం 1.30 కోట్లు రాబట్టింది. అన్ని షోలు ముగిసే సమయానికి జల్సా రికార్డులని ఖుషి అధికమిస్తుంది అని ట్రేడ్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పవన్ అభిమానులు (PK Fans) సోషల్ మీడియాలో మాస్ జాతర షురూ చేశారు. ఖుషి చిత్రంతో పవన్ స్టామినా మరోసారి రుజువైంది అని అంటున్నారు. ఇతర స్టార్ హీరోల చిత్రాలేవీ రీరిలీజ్ లో పవన్ (Pawan Kalyan) చిత్రాలని అధికమించలేకున్నాయి.
Also Read : Kiara And Sidharth: బాలీవుడ్ లో పెళ్లి భాజాలు.. కియారాతో సిద్దార్థ్ పెళ్లి ఫిక్స్!