Pawan Kalyan : ఆయ‌న‌కు త‌మ్ముడిగా పుట్టినందుకు గ‌ర్వంగా ఉంది : చిరుపై ప‌వ‌న్ పోస్ట్‌

ఆయన్ని అన్నయ్యగా కంటే తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి మా అన్నయ్య. నా జీవితానికి హీరో చిరంజీవి.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan interesting post on Chiranjeevi

Pawan Kalyan interesting post on Chiranjeevi

Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవికి హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌- యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం రావడంపై పవన్‌కల్యాణ్‌ ఆనందం వ్యక్తంచేశారు. ఆయ‌న‌కు త‌మ్ముడిగా పుట్టినందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ పుర‌స్కారం అన్నయ్య చిరంజీవి కీర్తిని మరింత పెంచిందంటూ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప‌వ‌న్ ఓ పోస్ట్ పెట్టారు. ఒక్క మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జీవితం మొదలుపెట్టి.. స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో మెగాస్టార్‌గా ఎదిగారు.

నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్నారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. ఆయన్ని అన్నయ్యగా కంటే తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి మా అన్నయ్య. నా జీవితానికి హీరో చిరంజీవి. తన సేవాగుణంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటు మరెంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం చేశారు. నటనకు పర్యాయపదంగా నిలిచారు. తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్నారు.

Read Also: Maoists Encounter : మరో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తున్నారు. నన్నే కాకుండా కోట్లాదిమంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య. నేను ఆయ‌న‌ను ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి మా అన్న‌య్య‌. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి. ప్రతిభ ఉంటే ఎవరైనా ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనడానికి ఉదాహరణగా నిలిచారు. చిరంజీవి సమాజానికి అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారం కూడా అందించింది.

తనకు యూకే పార్లమెంట్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈసందర్భంగా చిరంజీవికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకొని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన యూకే అధికార లేబర్‌ పార్టీ ఎంపీ నవేందుమిశ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు అని పవన్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా, యూకే పార్ల‌మెంటులో బ్రిడ్జ్ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పుర‌స్కారంతో ఘ‌నంగా స‌త్క‌రించింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి ఆయ‌న చేసిన‌ సేవ‌ల‌కుగానూ ఈ అరుదైన పుర‌స్కారం ద‌క్కింది.

Read Also: Betting Apps : రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ సహా పలువురు సినీ ప్రముఖులపై కేసు !

 

 

  Last Updated: 20 Mar 2025, 01:08 PM IST