Site icon HashtagU Telugu

Pawan Kalyan : వరల్డ్ లోనే అరుదైన రికార్డు సాధించిన పవన్ కళ్యాణ్

pawan kalyan speech in ap assembly

pawan kalyan speech in ap assembly

సినీ నటుడు , జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గూగుల్ లో అరుదైన రికార్డు సాధించి వార్తల్లో నిలిచారు. 2024 సంవత్సరంలో GOOGLEలో అత్యధికంగా శోధించిన రెండవ నటుడిగా రికార్డు (Google’s 2nd Most Searched Globally) సాధించారు. ఈ సంవత్సరం GOOGLE విడుదల చేసిన ‘అత్యధికంగా సెర్చ్ చేసిన నటులు’ (Entertainment) జాబితాలో పవన్ కళ్యాణ్ ఈ ఘనత సాధించారు. పవన్ గురించి మరింత తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు గూగుల్ లో ఆరా తీసారు.

ఈ జాబితాలో మొదటి స్థానాన్ని హాస్యనటుడు కాట్ విలియమ్స్ దక్కించుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఈ ఏడాది రాజకీయ వేత్తగా కూడా ప్రాముఖ్యత సాధించారు. ఆయన రాజకీయ ప్రకటనలు, పార్టీ కార్యకలాపాలు, సినిమాలపై జరుగుతున్న చర్చలతో ప్రజలు మరింత ఆసక్తి చూపించారు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా మారారు. ఆయన సినిమాలు, రాజకీయ వ్యూహాలు, నయా ప్రకటనలు ఇలా అన్ని అంశాలు మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో, ఆయన గురించి ప్రజల inquisitiveness ఎక్కువైంది. భారతదేశం నుంచి ఈ జాబితాలో ఇతర ప్రముఖులుగా హీనా ఖాన్ మరియు నిమ్రత్ కౌర్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో రెండో స్థానం సాధించడం ఫై అభిమానులు , జనసేన శ్రేణులు , సినీ ప్రముఖులు ఎలా ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ పక్క డిప్యూటీ సీఎం గా , మంత్రిగా ప్రజలకు సేవ చేస్తూనే మరోపక్క సెట్స్ ఫై ఉన్న సినిమాలను పూర్తి చేస్తున్నాడు. పగలు రాజకీయాలు , రాత్రి సినిమాలు చేస్తూ రేయిపగలు కష్టపడుతున్నారు.

Read Also : Trump Team Assets: ట్రంప్ అండ్ టీమ్ ఆస్తులు రూ.32.41 లక్షల కోట్లు.. 172 దేశాల జీడీపీ కంటే ఎక్కువే!