HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నా తన చేతిలో ఉన్న సినిమాలు ఎలాగైనా పూర్తిచేస్తానని తెలిపాడు. ఈ క్రమంలో మొదట హరిహర వీరమల్లు సినిమాని పూర్తిచేస్తున్నాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సినిమా ఇంకో 8 రోజులు మాత్రమే షూట్ మిగిలి ఉందని తెలిపారు. షూటింగ్స్ ఆలస్యం అవుతున్నా ఈ సినిమా నుంచి రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు.
తాజగా న్యూ ఇయర్ సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా నుంచి అప్డేట్ ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ కొత్త పోస్టర్ లో ఓ పక్క మంట వెలుగుతుంటే మరో పక్క పవన్ కళ్యాణ్ కూర్చొని నవ్వులు చిందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి మొదటి పాట ‘మాట వినాలి..’ అనే సాంగ్ ని జనవరి 6 ఉదయం 9 గంటల 6 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు.
దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా మార్చ్ 28 న రిలీజ్ చేయనున్నట్టు మరోసారి క్లారిటీ ఇచ్చారు మూవీ టీమ్. ఓ పక్క చివరి దశ షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కు మొదటి పాన్ ఇండియా మూవీ కావడం గమనార్హం.
2025 just got POWER-packed! ⚔️ 🔥
Let's Celebrate this New Year with the first single from #HariHaraVeeraMallu ~ Full song out on Jan 6th at 9:06AM💥#MaataVinaali In #Telugu ~ Sung by the one and only, POWERSTAR 🌟 @PawanKalyan garu 🎤🎶
A @mmkeeravaani Musical 🎹 pic.twitter.com/hXeyJSNjpe
— Mega Surya Production (@MegaSuryaProd) December 31, 2024
Also Read : Game Changer Trailer: గేమ్ ఛేంజర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్..!