Site icon HashtagU Telugu

HariHara VeeraMallu : హమ్మయ్య.. పవన్ హరిహర వీరమల్లు అయిపోయినట్టే.. చివరి రెండు రోజులు.. ట్రైలర్ అప్డేట్ కూడా..

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu

HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ రాజకీయాల బిజీవల్ల సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్న సంగతి తెలిసిందే. చేతిలో ఉన్న మూడు సినిమాలు ఎలాగైనా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇటీవలే నిర్మాతలతో మీటింగ్ పెట్టి ఆగస్టు లోపు ఆ మూడు సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తానని తెలిపాడు. దానికి తగ్గట్టే పవన్ పని మొదలుపెట్టాడు.

ఎప్పుడో అయిదేళ్ల క్రితం మొదలయిన హరిహర వీరమల్లు సినిమాకు పవన్ ఇంకో నాలుగు రోజులు డేట్స్ ఇవ్వాలని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. మూవీ యూనిట్ అధికారికంగా పవన్ షూట్ లో జాయిన్ అవుతున్నాడు అని ప్రకటించింది.

హరిహర వీరమల్లు షూటింగ్ కి మిగిలిన రెండు రోజులు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. గ్రాండ్ గా సినిమా షూటింగ్ ని పూర్తి చేయబోతున్నాము. త్వరలో అదిరిపోయే ట్రైలర్, అద్భుతమైన పాటలు రానున్నాయి రెడీగా ఉండండి అంటూ అధికారికంగా మూవీ యూనిట్ ప్రకటించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హరిహర వీరమల్లు అవ్వగానే త్వరలో OG సినిమాకు కూడా డేట్స్ ఇస్తారని తెలుస్తుంది. మొత్తానికి పవన్ త్వరగా సినిమాలు పూర్తి చేసేస్తే ఓ పని అయిపోతుంది, అప్పుడు పూర్తిగా ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టొచ్చు అని పవన్ ఫీల్ అవుతున్నారట.

 

Also Read : Thammudu : జులై 04 న వస్తున్న ‘తమ్ముడు’