పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) భారీ అంచనాల నడుమ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు రావడంతో పాటు, ఓ రోజు ముందుగా ప్రీమియర్స్ వేసే అవకాశం రావడంతో ఈ చిత్రం భారీగా ప్రీమియర్స్ ద్వారా వసూళ్లు రాబట్టింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రీమియర్స్ ద్వారా రూ. 11 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 4 కోట్లు వచ్చాయని టాక్.
సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేయడంతో పాటు, హౌస్‌ఫుల్ షోలతో మొదటి రోజు మంచి స్టార్ట్‌ను అందుకుంది. ఈ చిత్రం పై కొన్ని నెలలుగా పెరిగిన అంచనాలు, పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ కలెక్షన్లను పుష్ చేసినట్టు కనిపిస్తోంది.
Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం
కథ విషయానికి వస్తే.. ‘హరిహర వీరమల్లు’ 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే ధైర్యవంతుడైన యోధుడిగా కనిపిస్తారు. బందీగా ఉన్న ప్రజలకు విముక్తి కలిగించడానికి, కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడానికి ఒక ధైర్యమైన మిషన్‌ను చేపడతాడు. సినిమా విడుదలైన తొలి రోజే ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినా, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలు మెప్పించాయి. అయితే వీఎఫ్‌ఎక్స్ నాణ్యత, కథనం నిరాశపరిచింది.
ఈ చిత్రం మొదటి భాగంగా ‘Sword vs Spirit’ టైటిల్‌తో విడుదల కాగా, క్లైమాక్స్‌లో రెండో భాగానికి ‘Battlefield’ లేదా ‘యుద్ధభూమి’ అనే టైటిల్‌ను ప్రకటించారు. మరోవైపు, ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని సమాచారం. ఆగస్టు చివరి నాటికి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రావచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా, ‘హరిహర వీరమల్లు’ మొదటి రోజు కలెక్షన్లతో హిట్ టాక్ సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద బలంగా నిలిచింది.