Allu Sirish Wedding: మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లు శిరీష్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. ఆయన వివాహం నయనికా రెడ్డితో మార్చి 6న అత్యంత వైభవంగా జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమవ్వగా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా వేడుకలు కొనసాగుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి దంపతులకు ఆహ్వానం
వివాహ సంప్రదాయాల్లో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన భార్యతో కలిసి తన బావగారైన మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను స్వయంగా కలిసి పెళ్లి పత్రికను అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి దంపతులు అల్లు అరవింద్ కుటుంబానికి సాదర స్వాగతం పలికారు. ఈ ఆహ్వాన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా మెగా- అల్లు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించాయి.
Also Read: కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు
పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం
అనంతరం అల్లు కుటుంబం ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- ఆయన భార్య అన్నా లెజ్నెవాను కలిసి వివాహానికి ఆహ్వానించింది. ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి. మెగా బ్రదర్స్ అందరినీ కలిసి ఆహ్వానిస్తుండటంతో ఈ వివాహం మెగా-అల్లు కుటుంబాల కలయికగా నిలవబోతోంది.
అల్లు అర్జున్ ఘనమైన ప్రీ-వెడ్డింగ్ పార్టీ
పెళ్లికి ముందే సంబరాలను మరింత రెట్టింపు చేస్తూ శిరీష్ సోదరుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితులు, సినీ ప్రముఖుల కోసం ఒక విలాసవంతమైన పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ సెలబ్రేషన్ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి.
పెళ్లి తేదీ దగ్గరపడుతుండటంతో అల్లు నివాసంలో వేడుకలు రోజురోజుకూ మరింత ఉత్సాహంగా మారుతున్నాయి. నయనికా రెడ్డి – అల్లు శిరీష్ ల ఈ గ్రాండ్ వెడ్డింగ్ గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది కేవలం ఒక వివాహ వేడుక మాత్రమే కాదు, టాలీవుడ్‌లో ఈ ఏడాది జరగబోయే అతిపెద్ద వేడుకల్లో ఒకటిగా నిలవనుంది.
