Site icon HashtagU Telugu

OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

Pawan Fever

Pawan Fever

బాక్స్ ఆఫీస్ వద్ద OG కుమ్మేస్తుంది. సుజిత్ డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ సక్సెస్ ను పవన్ కళ్యాణ్ (Pawan) ఎంజాయ్ చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైరల్ ఫీవర్‌(Viral Fever)తో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా ఆయనకు జ్వరం తగ్గకపోవడం, దగ్గు ఎక్కువగా రావడం వలన వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన *ఓజీ* మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అభిమానులను నిరాశపరచకుండా వర్షంలో తడుస్తూ పాల్గొనడం, అలాగే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం వల్ల ఆయన ఆరోగ్యంపై ప్రభావం పడినట్లు భావిస్తున్నారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షల కోసం మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.

Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో, అభిమానుల మధ్య ఆందోళన కలిగించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి నారా లోకేశ్ కూడా పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యం తిరిగి సాధించి ప్రజాసేవ కొనసాగించాలని కోరుతూ సోషల్ మీడియా ద్వారా సందేశం పంపించారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ పవన్ శాఖాపరమైన పనులు ఆపకుండా, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించడం ఆయన కర్తవ్యనిబద్ధతను మరోసారి చూపించింది.

ఇకపోతే OG ఫస్ట్ డేనే రూ.154 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దసరా సెలవుల నేపథ్యంలో కలెక్షన్లు మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యల మధ్యలోనూ ఈ సినిమా విజయవార్త ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. అభిమానులు ఆయన త్వరగా కోలుకొని *ఓజీ* విజయోత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version