Site icon HashtagU Telugu

Pawan Kalyan : మరోసారి గొప్ప మనసు చాటుకున్న పవన్.. పాకీజాకు ఆర్ధిక సాయం

Pawan Kalyan Helps 2 Lakh F

Pawan Kalyan Helps 2 Lakh F

90వ దశకంలో తన నటనతో, ముఖ్యంగా కామెడీ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటి పాకీజా (Pakeezah) ఇటీవల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నై నుండి వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆమె అనంతరం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ తన పరిస్థితిని వివరిస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి నాయకుల సహాయాన్ని కోరారు. గతంలో చిరంజీవి, నాగబాబు, మోహన్ బాబు లాంటి నటులు తనకు సహాయం చేశారని తెలిపారు. పాకీజా ఆవేదన తెలుసుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తక్షణమే స్పందించి ఆమెకు ఆర్ధిక సాయం అందసారు.

Baba Ramdev : సహజంగానే మనిషి ఆయుష్షు 150 నుంచి 200 ఏళ్లు: బాబా రాందేవ్‌ కీలక వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథంతో రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరి ప్రసాద్, గిడ్డి సత్యనారాయణ లు కలిసి ఈ మొత్తాన్ని ఆమెకు అందజేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ యొక్క సానుభూతి, తక్షణ స్పందనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ చేసిన సహాయానికి పాకీజా కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. “తక్షణమే స్పందించి, అంత పెద్ద సాయం చేశారంటే ఇది మామూలు విషయం కాదు. జీవితాంతం ఆయన కుటుంబానికి రుణపడి ఉంటాను” అని ఆమె పేర్కొన్నారు. గతంలో సినీ పరిశ్రమలో బిజీగా ఉన్న సమయంలో తమిళ రాజకీయాల్లోకి వెళ్లిన ఆమె, తన భర్త, అత్తమామల కారణంగా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు వివరించారు. తల్లి క్యాన్సర్ చికిత్సకు ఉన్న డబ్బంతా ఖర్చైపోవడంతో ఇప్పుడు తినడానికి కూడా ఆర్థిక పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ సహాయం ఆమెకు కొత్త ఆశను చిగురించేలా చేసింది.