Site icon HashtagU Telugu

Cameraman Gangatho Rambabu : థియేటర్ లో మంట పెట్టిన పవన్ ఫ్యాన్స్..

Cameraman Gangatho Rambabu

Cameraman Gangatho Rambabu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ పేరు చెపితే చాలు అభిమానుల్లో రోమాలు నిక్క పొడుస్తాయి..చిత్రసీమలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ పవన్ క్రేజ్ వేరు..అందరికి అభిమానులు ఉంటె..పవన్ కళ్యాణ్ కు భక్తులు ఉంటారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ గా ఉన్నప్పటికీ..పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పవన్ నుండి కొత్త సినిమా వచ్చిన , రీ రిలీజ్ చిత్రం వచ్చిన అభిమానులు సంబరాలు చేసుకుంటారు. పెద్ద ఎత్తున కట్ ఔట్స్ ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకుంటారు. ఇప్పటీకే పవన్ నటించిన పలు చిత్రాలు రీ రిలీజ్ కాగా..ఈరోజు పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu) మూవీ రీ రిలీజ్ అయ్యింది. ఈ సందర్బంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ఇటీవల అభిమానులు అభిమానం పేరుతో థియేటర్స్ లలో చేసే రచ్చ వివాదాస్పదం అవుతుంది. థియేటర్ లో బాణా సంచా కాల్చడం..సీట్లు విరగొట్టడం, స్క్రీన్ లను చించడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈరోజు కూడా అలాంటి ఘటనే జరిగింది. పవన్ అభిమానులు ఏకంగా థియేటర్ లో మంట పెట్టారు. కాగితాలన్నీ పోగేసి మంట వేశారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండడం తో నెటిజన్లు విమర్శిస్తున్నారు. అదృష్టం కొద్దీ ఏ ప్రమాదం జరగలేదని . ఒక వేళ థియేటర్ తగలబడితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటికి అనుమతించొద్దని సూచిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కెమెరామెన్ గంగతో రాంబాబు విషయానికి వస్తే..2012లో పూరి జగన్నాధ్ రచించి దర్శకత్వం వహించిన మూవీ. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ , తమన్నా మరియు గాబ్రియేలా బెర్టాంటే , ప్రకాష్ రాజ్ మరియు కోట శ్రీనివాసరావు నటించారు. మణిశర్మ సౌండ్‌ట్రాక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను సమకూర్చగా, శ్యామ్ కె. నాయుడు మరియు ఎస్‌ఆర్ శేఖర్ సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్‌ను నిర్వహించారు. బద్రి (2000) తర్వాత 12 సంవత్సరాల తర్వాత పవన్ – పూరి కలయికలో వచ్చిన మూవీ ఇది. ప్రత్యేక తెలంగాణ అంశం నడుస్తున్న క్రమంలో ఈ సినిమా రిలీజ్ కావడం ..ఇందులో సన్నివేశాలు ప్రత్యేక తెలంగాణ అంశానికి వ్యతిరేకంగా ఉండడం తో చాల చోట్ల సినిమా షోస్ పడలేదు. పడనివ్వలేదు. దీంతో నిర్మాతలకు నష్టం వాటిల్లింది. ఇక ఇప్పుడు జగన్ యాత్ర కు పోటీగా రాంబాబు వచ్చింది.

Read Also : AP DSC : ఫేక్ నోటిఫికేషన్ ఎన్నికల తాయిలం మాత్రమే – గంటా