ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. అగ్ర హీరోల చిత్రాలే కాదు సూపర్ హిట్ అయినా గత చిత్రాలను మళ్లీ సరికొత్త టెక్నలాజి తో రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు. చిరంజీవి , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ , నాగార్జున , రవితేజ ఇలా చాలామంది హీరోలు నటించిన గత చిత్రాలను వారి వారి బర్త్డే లకు రీ రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 02 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే గబ్బర్ సింగ్ (Gabbar Singh Re Release) టికెట్ల డిమాండ్ మాములుగా లేదు. RTC క్రాస్ రోడ్స్ మూడు మెయిన్ సింగల్ స్క్రీన్లలో మొత్తం పదిహేను షోలు వేయబోతుండగా..ఆ 15 షోస్ కు దేనికీ టికెట్లు దొరకని పరిస్థితి. ఎంత రికమండేషన్ ఉన్నా కనీసం వెయ్యి ఖర్చు పెట్టనిదే బ్లాక్ లో దొరికే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం హైదరాబాద్ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించడం..డిప్యూటీ సీఎం గా పదవి చేపట్టడం..అంతే కాదు మెగా ఫ్యామిలీ కి అన్ని కలిసి వస్తుండడం తో ఆ సంబరాన్నంతా గబ్బర్ సింగ్ థియేటర్స్ లలో చూపించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదే క్రమంలో మహేష్ నటించిన మురారి (Murari) చిత్రం కూడా రీసెంట్ గా రీ రిలీజ్ అయ్యి రికార్డు వసూళ్లు సాధించింది. ఆ వసూళ్లను క్రాస్ చేయాలనీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే ఎక్కువ థియేటర్స్ లలో గబ్బర్ సింగ్ ను రీ రిలీజ్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెపుతుంది. మరి ఆ వర్షాల ఎఫెక్ట్ గబ్బర్ సింగ్ ఫై పడుతుందా అనేది చూడాలి.
Read Also : Mohanlal : మాలీవుడ్ను నాశనం చేయొద్దు.. వాళ్లకు శిక్ష తప్పదు: మోహన్ లాల్