పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బర్త్ డేయిన, సినిమా రిలీజ్ అయినా..ఫ్యాన్స్ ప్రాణాలు పోవాల్సిందే..ఇది ఈరోజు కాదు..ఎప్పటి నుండి నడుస్తుందే. పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చే అభిమానులు కోట్లలో ఉంటారు. పవన్ పుట్టిన రోజైన , సినిమా రిలీజ్ అయినా..వేడుక ఏదైనా సరే..అభిమానులు మాత్రం తమ ఇంట్లో తమదే వేడుక అన్నట్లు వ్యవహరిస్తుంటారు. భారీ భారీ ప్లెక్సీ లు , కట్ అవుట్ లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. ఈ క్రమంలో అనుకోని సంఘటలు ఎదురై వారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ముఖ్యంగా ప్లెక్సీలు కట్టే క్రమంలో కరెంట్ వైర్లను చూసుకోకుండా ప్రాణాలు పోగుట్టుకున్న ఘటనలు ఎన్నో చూసాం..ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలోనే కాదు మహేష్ , ప్రభాస్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఇలా అగ్ర హీరోల విషయంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.
We’re now on WhatsApp. Click to Join.
నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఓ పక్క భారీ వర్షం , వరదలు వస్తున్న ఏమాత్రం లెక్కచేయకుండా అభిమానులు బర్త్ డే వేడుకలు జరిపారు. ఈ క్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కరెంట్ షాక్ కొట్టడంతో ఓ యువకుడు మృతిచెందగా, మరో యువకుడికి గాయాలైన ఘటన చంద్రగిరి నియోజకవర్గంలోని అనుపల్లిలో జరిగింది. పవన్ కళ్యాణ్ బ్యానర్ కడుతూ ఇద్దరు యువకులు విద్యుత్ షాక్ కి గురయ్యారు. వీరిలో గోపి అనే యువకుడు మృతి చెందగా.. మధు అనే యువకుడికి తీవ్ర గాయాలు కావడం తో వెంటనే చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటారు. ఇది ఈరోజు కాదు మొదటి నుండి కూడా అంతే..బర్త్ డే వేడుకలు జరపవద్దని సూచిస్తుంటారు కూడా అయినప్పటికీ అభిమానులు మాత్రం తమ అభిమానాన్ని ఆపుకోలేక పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈరోజు కూడా పవన్ తన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని..పుట్టినరోజు సందర్భంగా వర్షాలు, వరద బాధితులకు సహాయం చేయాలని జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. బాధితులకు అండగా నిలబడి, స్వచ్ఛందంగా సేవా కార్యకర్రమాల్లో పాల్గొని సామాన్యులకు సహకారం అందించాలని సూచించారు. కొంతమంది పవన్ సూచనా మేరకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరికొంతమంది మాత్రం గబ్బర్ సింగ్ రీ రిలీజ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో బ్యానర్ కడుతూ కరెంట్ షాక్ కు గురయ్యారు.
Read Also : Pawan Birthday : పవన్ కళ్యాణ్ కు విషెష్ తెలియజేసిన మహేష్ బాబు
