Pathan @ ₹1000 Crore Club: రూ.1000 కోట్ల క్లబ్ కు చేరువైన ‘పఠాన్’

హీరో షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కథానాయకుడిగా నటించిన ‘పఠాన్‌’చిత్రం ఆయన కెరీర్లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది.

Published By: HashtagU Telugu Desk
Pathan has reached the Rs.1000 crore club Shah Rukh Khan

Pathaan

హీరో షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కథానాయకుడిగా నటించిన ‘పఠాన్‌’ (Pathan) చిత్రం ఆయన కెరీర్లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. గత నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల్ని సృష్టిస్తున్నది. కేవలం 19 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 950 కోట్ల వసూళ్లను సాధించింది. వెయ్యి కోట్ల మార్కు అందుకునేందుకు చేరువైంది. రెండు వారాలు పూర్తయినా బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా జోరు కొనసాగుతూనే ఉంది. ఈ ఆదివారం కూడా ఈ చిత్రం రూ. 12.50 కోట్లు రాబట్టింది.

భారత్‌తో పాటు విదేశాల్లోనూ ‘పఠాన్‌’ (Pathan) జోరు కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్ చేరనుంది. బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్‌ఖాన్‌ గూఢచారిగా నటించారు. దీపికా పదుకొన్, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషించారు.

Also Read:  Diabetes: భారత్‌లో 73 శాతం మందికి షుగర్ వచ్చే ఛాన్స్!

  Last Updated: 13 Feb 2023, 11:50 AM IST