Site icon HashtagU Telugu

Pathaan@50: హాఫ్ సెంచరీ కొట్టిన పఠాన్.. అయినా తగ్గని షారుక్ క్రేజ్

Pathan has reached the Rs.1000 crore club Shah Rukh Khan

Pathaan

సరైన హిట్స్ లేక వెలవెల బోతున్న బాలీవుడ్ (Bollywood) కు పఠాన్ (Pathaan) రూపంలో భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ బాలీవుడ్ లో కేజీఎఫ్, బాహుబలి రికార్డులను అధిగమించి నెంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ పఠాన్. ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకొని బాక్సాఫీస్ వద్ద ఇంకా మంచి వసూళ్లను రాబడుతోంది.

దాదాపు 20 దేశాల్లో ఈ చిత్రం (Pathaan) థియేటర్ల లో ప్రదర్శింపబడుతోంది. ఇండియా పలు రికార్డ్ లను క్రియేట్ చేసిన ఈ చిత్రం, బాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డ్ ను నెలకొల్పి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది.ఈ చిత్రం ఇప్పటి వరకూ 521 కోట్ల రూపాయలకు పైగా బాలీవుడ్ లో వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకునే, జాన్ అబ్రహం కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలో డిజిటల్ ప్రీమియర్ గా రానుంది.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు బాద్ షాగా మారాడు. ఎంతో కాలంగా సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన అభిమానగనాన్ని సంపాదించుకున్నాడు షారుక్. సుమారు 80కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన కింగ్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడు. ఖాన్ త్రయంలో ఒకరిగా సుధీర్ఘ కాలంగా సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న షారుక్ ఖాన్ చివరిగా 2018లో జీరో సినిమాతో ఓటమి చూశాడు. అయితే తాజాగా పఠాన్ (Pathaan) తో మాత్రం వరల్డ్ వైడ్ గా సాలిడ్ హిట్ కొట్టాడు.

Also Read: KTR: TSPSC ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో సమగ్ర విచారణ జరుపాలి