Pathaan box office: బాలీవుడ్ ఈజ్ బ్యాక్.. కేజీఎఫ్, బాహుబలి రికార్డ్స్ బద్దలు!

'పఠాన్' చిత్రం బాలీవుడ్ కు మళ్ళీ పూర్వ వైభవం తీసుకువస్తుంది.

  • Written By:
  • Publish Date - January 28, 2023 / 02:43 PM IST

షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం బాలీవుడ్ కు మళ్ళీ పూర్వ వైభవం తీసుకువస్తుంది. విడుదల ముందు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వివాదాలు ఎదుర్కొన్నా ఈ చిత్రం.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. కలెక్షన్లతో విమర్శలు చేసిన వారి నోరు మూయిస్తూ మైండ్ బ్లాంక్ చేస్తోంది. తొలి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ చిత్రం మూడు రోజులు పూర్తయ్యే సరికి  అంతకుమించిన రేంజ్ల్ కలెక్షన్స్ ను అందుకుంటోంది.

జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. శుక్రవారం నాటికి వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలిసింది. ఓవర్సీస్ లో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది. షారుఖ్ సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూలు చేయడం ఇది పన్నెండో సారి. దీని బట్టి బాద్షా స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది. తద్వారా ఇండియాలో మూడు రోజుల్లో ఎక్కువ రాబట్టిన చిత్రంగానూ నిలిచింది. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్ 2’ ‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్ చేసింది. అలాగే హిందీలోనూ టాప్ మూవీగా సంచలనం సృష్టించింది. ఇక ఈ రెండు రోజులు హాలిడేస్ కాబట్టి మరో రూ 200 కోట్లు అందుకోవడం పక్కా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా ఐదు రోజుల్లోనే రూ.500కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. కాగా స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఇండియన్ రా ఏ జెంట్గా కనిపించారు.  దీపికా పడుకొణె..   షారుక్ సరసన నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించి అదరగొట్టారు. సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రూ. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ రూపొందించారు.