Site icon HashtagU Telugu

Pat Cummins : మొన్నటివరకు వార్నర్.. ఇప్పుడు పాట్ కమ్మిన్స్.. తెలుగు నీళ్లు బాగా పని చేస్తున్నాయి..

Pat Cummins Reel Video For Fahadh Faasil Aavesham Song

Pat Cummins Reel Video For Fahadh Faasil Aavesham Song

Pat Cummins : ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ డేవిడ్ వార్నర్ (David Warner), పాట్ కమ్మిన్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ టీంకి ఆడి.. ఇక్కడి కల్చర్ కి బాగా అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా సినిమాని విపరీతంగా ఆదరించే మన తెలుగువారి నుంచి.. కొంత సినిమా పిచ్చిని వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఈ సినిమా పిచ్చి విషయంలో డేవిడ్ వార్నర్ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు లభించడానికి రాజమౌళి ఎంతగా కృషి చేసారో.. వార్నర్ భాయ్ కూడా అంటే కృషి చేసారు అని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి లేదు అనుకుంట. బుట్టబొమ్మ, పుష్ప సాంగ్ స్టెప్స్ తో పాటు టాలీవుడ్ హీరోల మ్యానరిజమ్స్ అండ్ డైలాగ్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ లో తెలుగు సినిమాని వైరల్ చేసారు. ఇక డేవిడ్ తరువాత ఈ బాధ్యతని ఇప్పుడు మరో సన్ రైజర్స్ ఆటగాడు తీసుకున్నాడు.

ప్రస్తుతం హైదరాబాద్ టీంకి కెప్టెన్ గా ఉన్న పాట్ కమ్మిన్స్ కూడా సినిమా కల్చర్ కి అలవాటు పడుతున్నారు. ఇటీవల మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ డైలాగ్స్ ని చెబుతూ అదరగొట్టిన పాట్ కమ్మిన్స్.. రీసెంట్ గా ఫహాద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ మూవీలోని ట్రేండింగ్ సాంగ్ రీల్ ని రీ క్రియేట్ చేస్తూ ఓ వీడియో చేసారు. ఈ వీడియోని సన్ రైజర్స్ టీం తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ పాట్ కమ్మిన్స్ అండ్ డేవిడ్ వార్నర్ తో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Also read : Chiranjeevi – NTR : రాఖీ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి చిరంజీవి ఏమ్మన్నారంటే..