Paruchuri Review on Prabhas Salaar : స్క్రీన్ ప్లే తో ఆటాడుకున్నాడు.. ప్రభాస్ సలార్ పై పరుచూరి రివ్యూ..!

Paruchuri Review on Prabhas Salaar రిలీజైన సినిమాల గురించి సీనియర్ రైటర్ పరుచూరి పలుకులు అంటూ తన యూట్యూబ్ ఛానెల్ లో రివ్యూ చెబుతుంటారు పరుచూరి గోపాలకృష్ణ. సినిమా రిలీజై కొన్నాళ్లకు సినిమాలపై ఆయన చేసే విశ్లేషణ

  • Written By:
  • Publish Date - January 27, 2024 / 06:58 PM IST

Paruchuri Review on Prabhas Salaar రిలీజైన సినిమాల గురించి సీనియర్ రైటర్ పరుచూరి పలుకులు అంటూ తన యూట్యూబ్ ఛానెల్ లో రివ్యూ చెబుతుంటారు పరుచూరి గోపాలకృష్ణ. సినిమా రిలీజై కొన్నాళ్లకు సినిమాలపై ఆయన చేసే విశ్లేషణ గురించి అందరు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా ప్రభాస్ సలార్ గురించి పరుచూరి పలుకులలో ప్రస్తావించారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఈ ఇద్దరే సలార్ 1 సినిమాకు హీరోలని అన్నారు పరుచూరి.

జానపదం, సాంఘీకం, పురాణికం, చారిత్రాత్మకం ఇలా ప్రపంచ దేశాల్లో సినిమాలు ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్నిటినీ ఒకే సినిమాలో చేర్చే అది సలార్ అని అన్నారు. ప్రభాస్ ఈ సినిమాలో వన్ మ్యాన్ షో చేశాడు. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ పర్సన్ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన డైరెక్షన్ లో ఈ కథ ఇలా వచ్చి ఉండకపోతే ఇంత హిట్ అందుకునేదా అని ఆయన డౌట్ వ్యక్తపరిచారు.

We’re now on WhatsApp : Click to Join

ఇక కథ ఇండియాలో జరిగినట్టు చూపిస్తే సెన్సార్ రాదు. ఇందులో కొన్ని సీన్స్ తీవ్రమైన హింస ఉంది. అందుకే పొరుగు దేశంలో జరిగినట్టు చూపించారు. 1127లో 3 జాతులకు చెందిన కథగా ఈ సినిమా మొదలైంది. 1980, 2017 వరకూ కథ నడిపించారు. అఖండ భారతంలో కలవడానికి రాజమన్నార్ తండ్రి అంగీకరించలేదు అన్న మాటలు స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడికి ఉన్న క్లారిటీని తెలిసేలా చేశాయని అన్నారు.

ఒక సాధారణ కథగా మొదలు పెట్తి కొంత టైం తర్వాత సలార్ స్టోరీ రివీల్ చేయడం చూస్తే స్క్రీన్ ప్లేతో దర్శకుడు ఆటాడుకున్నాడని చెప్పారు పరుచూరి. కథ కథనంతో మరో లోకంలోకి తీసుకెళ్లారు. 30 నిమిషాల వరకు హీరో మాట్లాడిన సందర్భాలు కనిపించలేదు.. ప్రభాస్ ని చాలా గొప్పగా చూపించారు. సలార్ పార్ట్ 1 అద్భుతంగా ఉందని అన్నారు పరుచూరి.

Also Read : Radhika Sharathkumar : ఆ సినిమా ఎవరైనా చూశారా.. అహస్యం కలిగింది.. వాంతి చేయాలని ఉంది.. రాధిక ఈ రేంజ్ ఫైర్ కారణం ఏంటి..?

ఇక ఈ సినిమా ఎందుకు చూడాలని ప్రశ్నిస్తే.. ప్రభాస్ నటన.. ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే, స్నేహధర్మం కోసమని చెబుతానని అన్నారు. పాత్రధారులందరూ అద్భుతంగా నటించినప్పటికీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక ప్రభాస్, ప్రశాంత్ నీల్ మాత్రమే మనకు గుర్తుంటారని అన్నారు. సలార్ గొప్ప సక్సెస్ అందుకున్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ మిగతా అందరికీ అభినందనలు తెలిపారు పరిచూరి.