Site icon HashtagU Telugu

Rakesh Master : ఒక్కరైనా ఆయన్ని పట్టించుకోవాల్సింది అంటూ.. రాకేష్ మాస్టర్ పై పరుచూరి గోపాలకృష్ణ ఎమోషనల్ కామెంట్స్..

Paruchuri Gopala Krishna emotional Comments on Rakesh Master goes viral

Paruchuri Gopala Krishna emotional Comments on Rakesh Master goes viral

ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డ్యాన్స్(Dance) మాస్టర్ గా పనిచేసిన రాకేష్ మాస్టర్(Rakesh Master) ఇటీవల జూన్ 18న మరణించారు. పలు ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తో చికిత్స తీసుకుంటూ హాస్పిటల్(Hospital)లో మరణించి సినీ పరిశ్రమలో, డ్యాన్సర్లలో విషాదం మిగిల్చారు. ఆయన మరణవార్త విని పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.

రాకేష్ మాస్టర్ ఎన్నో మంచి మంచి సాంగ్స్ లో తన స్టెప్స్ తో అదరగొట్టారు. ఆ తర్వాత ఢీ, ఆట లాంటి పలు డ్యాన్స్ షోలలోనూ జడ్జిగా, టీంలీడర్ గా పాల్గొన్నారు. ఆ తర్వాత మనీ ప్రాబ్లమ్స్ తో కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు. అప్పట్నుంచి నుంచి డ్యాన్స్ కి కొంచెం దూరమయి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తో సహా పలువురు కొరియోగ్రాఫర్స్ రాకేష్ మాస్టర్ దగ్గర నుంచి వచ్చిన వారే. ఆయన మరణం తర్వాత రాకేష్ మాస్టర్ తనయుడు మీడియాతో మాట్లాడుతూ ఇకనైనా మమ్మల్ని వదిలేయండి అంటూ ఎమోషనల్ గా మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.

తాజాగా రాకేష్ మాస్టర్ మరణంపై ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopalakrishna) ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు. ఆయన యూట్యూబ్ ఛానల్ ‘పరుచూరి పలుకులు’లో రెగ్యులర్ గా సినిమాలకు సంబంధించిన వీడియోలు పెడతారు. తాజాగా రాకేష్ మాస్టర్ మరణంపై స్పందిస్తూ ఓ వీడియోని షేర్ చేశారు.

ఈ వీడియోలో పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. రాకేష్ మాస్టర్ తో నేను ఎక్కువగా పనిచేయలేదు, కానీ ఆయన గురువు ముక్కురాజు గారి దగ్గర ఎక్కువగా చూశాను. ఆ తర్వాత ఢీ, జబర్దస్త్ షోలలో కనిపించారు. అయన లేరని వార్త చూసి షాక్ అయ్యాను. ఇటీవల వాళ్ళ అబ్బాయి మీడియాతో మాట్లాడుతూ ఇకనైనా మా నాన్న గురించి మాట్లాడటం ఆపేయండి, మమ్మల్ని బతకనివ్వండి అని మాట్లాడాడు. అది చూసి చాలా బాధేసింది. రాకేష్ మాస్టర్ వందల సినిమాలకు పనిచేశారు. చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఆయన శిష్యులే. కానీ ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనను ఎవరూ దగ్గరికి తీసుకోలేదు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు చూశాక ఎంత బాధపడ్డాడో అర్థమైంది. ఆయన ఇంటర్వ్యూలలో మాట్లాడిన బాధని తప్పుగా ప్రచారం చేశారు. ఇండస్ట్రీలో ఎవరో ఒకరు ఆయనకు ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు ఆయన అలా మారేవారు కాదు. చివరి దశలో అవకాశాలు లేకే ఆయన ఎంత మదనపడ్డారో అర్థమైంది, ఆయనకు స్వర్గలోక ప్రాప్తి కలగాలి అని ఎమోషనల్ గా మాట్లాడారు.

 

Also Read :  Karthika Deepam 2 : కార్తీక దీపం సీరియల్ సీక్వెల్ ఉందా? డాక్టర్ బాబు ఏమన్నాడు?