Site icon HashtagU Telugu

Oscars 2024 : ఆస్కార్ అవార్డుల ఫుల్ లిస్టు ఇదిగో..

Oscars 2024

Oscars 2024

Oscars 2024 : అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌‌లో ఉన్న డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. గత ఏడాది ఆర్ఆర్ఆర్ సాంగ్‌కు ఆస్కార్‌ అవార్డు రావటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ వేడుకకు కనెక్ట్ అయ్యారు. ఈ ఏడాది ఇండియన్ మూవీస్ ఏవీ, కాంపిటీషన్‌లో లేకపోయినా బజ్‌ మాత్రం ఉంది. హాలీవుడ్ మూవీ ఓపెన్‌ హైమర్ ఆస్కార్ బరిలో సత్తా చాటింది. 13 కేటగిరీల్లో పోటీపడిన ఈ మూవీ ఏడు కేటగిరీల్లో అవార్డులు సాధించింది.  ఇండియా నుంచి డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరీలో అవార్డు బరిలో నిలిచిన ‘టు కిల్‌ ఏ టైగర్‌’కు నిరాశే మిగిలింది. ఈ కేటగిరిలో ‘‘20 డేస్‌ ఇన్ మారియోపోల్‌’’ డాక్యుమెంటరీకి అవార్డు దక్కింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింను రూపొందించారు.డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ది లాస్ట్ రిపేర్‌ షాప్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కేటగిరీలో గాడ్జిల్లా మైనస్‌ వన్‌, ఇంటర్నేషనల్‌ ఫీచల్‌ ఫిలిం కేటగిరీలో ది జోన్ ఆఫ్ ఇంట్రస్ట్ సినిమా అవార్డులు సాధించాయి.

We’re now on WhatsApp. Click to Join

ఉత్తమ చిత్రం

ఓపెన్‌ హైమర్

ఉత్తమ నటుడు

సిలియన్ మర్ఫీ – ఓపెన్‌ హైమర్

ఉత్తమ నటి

ఎమ్మా స్టోన్ – పూర్ థింగ్స్

ఉత్తమ దర్శకుడు

క్రిస్టోఫర్ నోలన్ – ఓపెన్‌హైమర్

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్

రాబర్ట్ డౌనీ జూనియర్ – ఓపెన్‌హైమర్

ఉత్తమ సహాయ నటి

డావిన్ జాయ్ రాండోల్ఫ్ – ది హోల్డోవర్స్

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే

అమెరికన్ ఫిక్షన్

ఒరిజినల్ స్క్రీన్ ప్లే

అనాటమీ ఆఫ్ ఎ ఫాల్

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్

ది బాయ్ అండ్ ది హెరాన్

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్

వార్ ఈజ్ ఓవర్..ఇన్ స్పైర్డ్ బై ది మ్యూజిక్ ఆఫ్ జాన్ అండ్ యోకో

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్

ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ – యునైటెడ్ కింగ్‌డమ్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్

20 డేస్ ఇన్ మారియోపోల్

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్

ది లాస్ట్ రిపేర్ షాప్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్

ఓపెన్‌హైమర్

ఉత్తమ ఒరిజినల్ పాట

వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)

ఉత్తమ ధ్వని

ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

ఉత్తమ ఉత్పత్తి డిజైన్

పూర్ థింగ్స్

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్

ది వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్

ఉత్తమ సినిమాటోగ్రఫీ

ఓపెన్‌హైమర్

ఉత్తమ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్

పూర్ థింగ్స్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్

పూర్ థింగ్స్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్

గాడ్జిల్లా మైనస్ వన్

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్

ఓపెన్‌హైమర్

Also Read : John Cena : దుస్తుల్లేకుండా ఆస్కార్ వేదికపై జాన్ సీనా రచ్చ.. వీడియో వైరల్