Ram Charan: రామ్ చరణ్ చిత్రానికి ఆస్కార్ విజేత బాణీలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి బ్లాక్ బ్లస్టర్ హిట్ అందుకున్నాడు. దాంతో రామ్ చరణ్ క్రేజ్ హాలీవుడ్ స్థాయికి చేరింది.

Published By: HashtagU Telugu Desk
Oscar Winning Songs For Ram Charan Movie

Oscar Winning Songs For Ram Charan Movie

Ram Charan Oscar Winning Song : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి బ్లాక్ బ్లస్టర్ హిట్ అందుకున్నాడు. దాంతో రామ్ చరణ్ క్రేజ్ హాలీవుడ్ స్థాయికి చేరింది. ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబల్ అవార్డు కూడా అందుకున్నారు చెర్రీ. విశ్వసనీయ సమాచారం మేరకు చెర్రీ కోసం హాలీవుడ్ మేకర్స్ స్క్రిప్ పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ త్వరలోనే ఆస్కార్ విజేత రెహమాన్ తో పనిచేయనున్నారు. దీంతో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులేకుండాపోయింది.

ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ (Ram Charan) శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గేమ్ చేంజర్ టైటిల్ ని ఖరారు చేసింది చిత్ర బృందం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా చెర్రీ తన తదుపరి చిత్రంపై ఇప్పటికి హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు అద్భుతమైన కథతో రామ్ చరణ్ ని ఒప్పించాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతుంది. డెబ్యూ సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన డైరెక్టర్ గా బుచ్చిబాబుకు టాలీవుడ్ నీరాజనం పలికింది. నిజానికి ఉప్పెన తర్వాత ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

దీంతో అదే కథను చెర్రీకి వినిపించి ఒకే చేయించుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాపై ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇదిలా ఉండగా ఈ క్రేజీ కాంబోకి మరో క్రేజీనెస్ తోడవ్వనుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. గతంలో రెహమాన్ పలు తెలుగు చిత్రాలకు అద్భుతమైన బాణీలు అందించారు. మహేష్ బాబు నటించిన నాని, పవన్ కొమరం పులి, నాగ చైతన్య నటించిన ఏ మాయ చేసావే ఇలా పలు చిత్రాలకు సంగీతం అందించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ సినిమాను సెప్టెంబర్ లో పట్టాలకు ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ కు జోడిగా ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అవుతారని ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి.

Also Read:  KCR vs Modi: మోడీపై తిరుగుబాటు కేసీఆర్ చతురత

  Last Updated: 10 Apr 2023, 12:50 PM IST