Oppenheimer : ‘ఓపెన్ హైమర్’ మూవీ దుమ్ము రేపింది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల పోటీలో ఎవరూ అందుకోలేనంత స్పీడుతో దూసుకుపోయింది. ఆస్కార్ రేసులో ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్ ఎంపికైంది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొత్తం 13 విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ కాగా, ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ మూవీ కేటగిరిలో ‘ఓపెన్‌హైమర్’(Oppenheimer), ‘అమెరికన్ ఫిక్షన్’, ‘బార్బీ’, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ పోటీ పడగా.. వాటన్నిటినీ అధిగమించి ‘ఓపెన్‌హైమర్’ సినిమా బెస్ట్ మూవీగా ఆస్కార్ సొంతం చేసుకుంది. గతేడాది సరిగ్గా ఇదే రోజున ‘ఓపెన్ హైమర్’, ‘బార్బీ’ సినిమాలు రిలీజ్ కావడం విశేషం.అప్పుడు కలెక్షన్ల పరంగా బార్బీని అధిగమించిన ఓపెన్ హైమర్.. ఇప్పుడు బెస్ట్ పిక్చర్ రేసులోనూ బార్బీని దాటేసి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఓపెన్ హైమర్ మరికొన్ని విభాగాల్లోనూ అవార్డులు గెల్చుకుంది.
The ‘OPPENHEIMER’ team on the #Oscars2024 stage after winning Best Picture. pic.twitter.com/TPssXpRwUc
— Christopher Nolan Art & Updates (@NolanAnalyst) March 11, 2024
We’re now on WhatsApp. Click to Join
ఓపెన్ హైమర్ మూవీ టీమ్ సాధించిన ఇతర ఆరు ఆస్కార్ అవార్డుల జాబితాలో.. బెస్ట్ యాక్టర్ – కిలియన్ మర్ఫీ, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – రాబర్ట్ డౌనీ జూనియర్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ – జెన్నిఫర్ లేమ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ – ఓపెన్ హైమర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్- వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్, బెస్డ్ డైరెక్టర్ – క్రిస్టోఫర్ నోలన్ ఉన్నాయి. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఆదివార అర్ధరాత్రి అట్టహాసంగా జరిగింది. డాల్బీ థియేటర్‌లో 96వ అకాడమీ అవార్డులను ఈసందర్భంగా ప్రదానం చేశారు. జిమ్మీ కిమ్మెల్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు.
Also Read : John Cena : దుస్తుల్లేకుండా ఆస్కార్ వేదికపై జాన్ సీనా రచ్చ.. వీడియో వైరల్
అణుబాంబును కనిపెట్టే క్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త ఓపెన్‌హైమర్ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, ఆయనకు ఎదురైన ఒత్తిడులను ఈ సినిమాలో చక్కగా చూపించారు. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం అదుర్స్ అనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ అందుబాటులోనూ ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో ఈ మూవీని మనం చూడొచ్చు. ఇంగ్లిష్ తో పాటు తెలుగు తదితర భాషల్లోనూ ఓపెన్ హైమర్ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటర్ బేసిస్ లో కూడా ఈ సినిమాను మనం చూడొచ్చు.