Site icon HashtagU Telugu

Short Films : అప్పట్లో షార్ట్ ఫిలిమ్స్‌ని కూడా థియేటర్‌లో రిలీజ్ చేసేవారట.. కానీ..

Once upon a Time Short Films Released in Theaters but Result

Once upon a Time Short Films Released in Theaters but Result

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలన్నా, తమ టాలెంట్ ని నలుగురికి చూపించాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఈజీగా వస్తున్నారు. పలువురు డైరెక్టర్స్ షార్ట్ ఫిలిమ్స్ తీసి, వాటిని యూట్యూబ్, ఓటీటీ వంటి సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ లో షేర్లు చేసి నిర్మాతలు, హీరోల దృష్టిలో పడుతున్నారు. ఇప్పుడంటే యూట్యూబ్, ఓటీటీ వంటి సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాయి. మరి గతంలో షార్ట్ ఫిలిమ్స్(Short Films) తీసేవారా..? తీస్తే వాళ్ళు వాటిని ఎక్కడ ప్రదర్శించేవారు..?

సినిమా అనేది పరిచయమైన రోజుల్లో ఒక్కో సినిమా నిడివి దాదాపు 3 గంటల సమయం ఉండేదట. తమిళ సినిమాలు అయితే ఇంకా ఎక్కువ నిడివి ఉండేవట. సినిమా కథ చిన్నదే అయ్యినప్పుడు.. దానిని లాగి లాగి బోరుకొట్టించకుండా షార్ట్ ఫిలింలా ఒక గంట, గంటన్నర నిడివితో అప్పటిలో కూడా చిత్రాలను తెరకెక్కించేవారు. ఇక ఆ సినిమాలను కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చేసేవారు. అయితే థియేటర్ లో ఆట నిడివి మూడు గంటల ఉండడంతో.. ఒకటి రెండు షార్ట్ ఫిలిమ్స్ ని కలిపి రిలీజ్ చేసేవారట. అలా ఒకే టికెట్ పై రెండు మూడు సినిమాలు చూపించేవారట.

ఈ నేపథ్యంతోనే 1938లో దర్శకుడు సి.పుల్లయ్య ‘కాసులపేరు’ అనే ఒక సినిమాని తీశారు. దాని నిడివి తక్కువ ఉండడంతో.. ‘సత్యనారాయణ వ్రతం’ అనే మరో సినిమా తెరకెక్కించారు. ఈ రెండిటిని కలిపి రిలీజ్ చేద్దామని చూస్తే.. రెండు గంటల నిడివి కూడా రాలేదట. దీంతో ‘చల్‌ మోహనరంగా’ అనే పాటని రూపొందించి.. మూడింటిని కలిపి రిలీజ్ చేశారట. అయితే మూడు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అతుకుల బొంతలా ఉందని ఆడియన్స్ తిరస్కరించారట.

ఆ తరువాత 1940లో ఆర్‌.ఎస్‌.ప్రకాష్‌ తెరకెక్కించిన ‘బారిష్టర్‌ పార్వతీశం’, హెచ్‌.ఎమ్‌.రెడ్డి రూపొందించిన ‘బొండాం పెళ్లి’, ‘చదువుకున్న భార్య’ సినిమాలను కలిపి రిలీజ్ చేశారు. ఈసారి కూడా ఆడియన్స్ తిరస్కరించడమే జరిగింది. అయితే ‘బారిష్టర్‌ పార్వతీశం’ మూవీని తరువాత సింగల్ గా రిలీజ్ చేస్తే హిట్ అయ్యిందట. ఇది నవలా ఆధారంగా తెలుగులో తెరకెక్కిన మొదటి చిత్రం.

రెండు మూడు సినిమాలను రిలీజ్ చేయడం అనే పద్ధతి 1938, 1948లో ఫెయిల్ అయినా 1941లో కొంచెం సక్సెస్ అయ్యిందనే చెబుతుంటారు. పింగళి నాగేంద్రరావు రచించిన ‘భలేపెళ్లి’, కొడవటిగంటి కుటుంబరావు రచించిన ‘తారుమారు’ సినిమాలను ఒకే చిత్రంగా రిలీజ్ చేయగా బాగా ఆడిందని చెబుతారు. హాస్యం కథాంశంతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలను జగన్నాథ్‌‌ డైరెక్ట్‌ చేశారు.

 

Also Read : Chiranjeevi : వెంకీ మామ చిరుకి ఫోన్ చేసి.. ఆ మూవీ నేను చేస్తే బాగుండేదని అన్నారట.. ఏ సినిమా?

Exit mobile version