Site icon HashtagU Telugu

Onam Festival : చీరకట్టులో హీరోయిన్స్ ఎంత అందంగా ఉన్నారో..

onam festival special Heroines in Saree

onam festival special Heroines in Saree

కేరళ ప్రజలకు ఓనమ్‌ పండుగ (Onam Festival ) అనేది చాల పెద్ద పండగ. ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. మనకు సంక్రాంతి పండుగ ఎలానో మలయాళీలకు ఓనం అలా అన్నమాట. ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో కేరళవాసులు ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 10 రోజులపాటు సాంప్రదాయబద్దంగా నిర్వహించుకునే ఈ పండుగ ఈ నెల 20న మొదలైన ఈ పండుగ 31వ తేదిన తిరువోనం, మహాబలి కార్యక్రమాలతో పూర్తవుతుంది.

Read Also : విజయ్ పట్టుకుంది ఎవరి చెయ్యి..? కీలక ప్రకటన పెళ్లి గురించేనా..?

ఈ (Onam Festival ) పండుగ సందర్భంగా కేరళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. ఏనుగుల స్వారీలు, తెల్లటి దుస్తుల్లో మగువలు, రకరకాల పూలతో సుందరంగా చేసిన అలంకరణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలు రకరకాల పువ్వులను సేకరించి వాటితో ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి ఆ మధ్యలో దీపం వెలిగిస్తారు. దీన్ని మలయాళంలో పూక్కలం అంటారు. ఓనం సందర్భంగా కేరళలో రంగవల్లులపై పోటీలు కూడా నిర్వహిస్తుంటారు.

ఇక ఓనమ్‌ పండగను మలయాళీ హీరోయిన్ తో పాటు, తెలుగు లో రాణిస్తున్న భామలు సైతం ఈ పండగను ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నారు. సంప్రాదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. వీరి తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌, కల్యాణి ప్రియదర్శిన్‌, మంజిమా మోహన్‌, మాళవిక మోహనన్‌, పూర్ణ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మొదలగువారు సంప్రదాయ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వారిపై లుక్ వెయ్యండి.