పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మళ్లీ సినిమా షూటింగ్ లతో బిజీ అయ్యారు. ఈరోజు ఉదయం మంగళగిరి లో వేసిన ప్రత్యేక సెట్ లో హరిహర వీరమల్లు సినిమా (Hari Hara Veera Mallu ) షూటింగ్ లో పాల్గొన్నారు. అలాగే మిగతా సినిమాలను సైతం పూర్తి చేయాలనీ చూస్తున్నాడు. ఇదిలా ఉంటె..పవన్ కళ్యాణ్ – సుజిత్ కలయికలో తెరకెక్కుతున్న ‘OG ‘ మూవీ అప్డేట్ కావాలంటూ అభిమాని పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇప్పటివరకు OG సినిమా నుంచి ఒక్క టీజర్ మినహా ఎలాంటి అప్డేట్స్ లేవు. దీంతో కొంతకాలంగా పవన్ ఫ్యాన్స్ అప్డేట్స్ కావాలంటూ సోషల్ మీడియాలో మేకర్స్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని- మేకర్స్ మధ్య సరదా సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఓజీ అప్డేట్ కావాలంటూ ఓ అభిమాని ‘ఓజీ అప్డేట్ ఇచ్చి చావు’ అని పోస్ట్ పెట్టాడు. దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. ‘అప్డేట్లు ఇవ్వకుండా చావనులే. ఉన్నప్పుడు ఇస్తా. ప్రస్తుతానికి సీజ్ ది షిప్’ అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరలైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాకినాడ పోర్టులో పవన్‌కల్యాణ్ అన్న ‘సీజ్ ది షిప్’ పదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో ఈ మాటలను కూడా ఓజీ సినిమాలో ఉపయోగించాలని డైరెక్టర్ సుజీత్‌ను ఫ్యాన్స్ కోరుతున్నారు.
‘OG’ చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Meerentraaa Vaaraaniki Okasaari… pic.twitter.com/h67e2aWCWo
— DVV Entertainment (@DVVMovies) November 30, 2024
Read Also : Boycott Pushpa 2 : ట్రెండింగ్ లో బాయ్ కాట్ పుష్ప 2..!