Site icon HashtagU Telugu

OG Sequel: ‘OG’ సీక్వెల్ ఫిక్స్ ..!!

Og Sequel

Og Sequel

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ఓజీ (OG) చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉండబోతోందని మేకర్స్ చివర్లో స్పష్టమైన హింట్ ఇచ్చారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా జపాన్ నేపథ్యంతో కథ కొనసాగనున్నట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ మళ్లీ కనిపిస్తారా లేదా అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం రాలేదు. అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ కొనసాగుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Gold Price Today : ఈరోజు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు

మొదటి భాగంలో ముంబయి అండర్‌వర్డ్ కథనాన్ని చూపించిన దర్శకుడు సుజీత్, సీక్వెల్‌లో జపాన్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈసారి అంతర్జాతీయ స్థాయి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా కథను మలచబోతున్నారని ఫిలింనగర్ టాక్. కొత్త లొకేషన్లు, కొత్త యాక్షన్ సన్నివేశాలు, అలాగే పవర్ స్టార్ పాత్రలో మరింత లోతైన డైమెన్షన్ చూపించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఓజీ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన 6–8 వారాల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ఈ చిత్రం డిజిటల్ వేదికపై కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా ఓజీ విజయం సీక్వెల్ అంచనాలను మరింత పెంచింది.

Exit mobile version