OG Business : మతిపోగొడుతున్న పవన్ కళ్యాణ్ ‘OG’ ప్రీ రిలీజ్ బిజినెస్

OG Business : కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే అభిమానుల్లో ఎనలేని హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు సుజీత్, గ్లింప్స్ వీడియోతో మాత్రం ఇండియా అంతటా పవన్ మేనియా రచ్చ చేశాడు

Published By: HashtagU Telugu Desk
Og Rights

Og Rights

పవన్ కళ్యాణ్‌ సినిమాలకు ఎప్పుడూ ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందనడంలో సందేహం లేదు. సినిమా హిట్ అయినా..ప్లాప్ అయినా సరే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంటాయి. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘ఓజీ’ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే అభిమానుల్లో ఎనలేని హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు సుజీత్, గ్లింప్స్ వీడియోతో మాత్రం ఇండియా అంతటా పవన్ మేనియా రచ్చ చేశాడు. రీమేక్ సినిమాలతో పరిమితమైన ఆశలు పెట్టుకున్న అభిమానులకు ‘ఓజీ’ ద్వారా పవన్ అసలైన శైలిని చూపించబోతున్నాడు.

Durgam Cheruvu : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా, సినిమా మీద ఆయన నిబద్ధత తగ్గలేదు. షూటింగ్ ఆలస్యం అయినా, మేకర్స్ సినిమాను వేగంగా పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీ గా జరుగుతుంది. ఇప్పటికే సీడెడ్ రైట్స్ రూ.24 కోట్లకు, నైజాం రైట్స్ రూ.90 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ లెక్కలతోనే ‘ఓజీ’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా సాగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్, లీడర్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ అనే మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. మాస్ ఫైట్ సీన్‌లో పవన్ షర్ట్ లెస్ సీన్ కూడా ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ‘పంజా’లో లైట్ గ్యాంగ్‌స్టర్ పాత్ర చేసిన పవన్, ఈసారి మాత్రం పూర్తి స్థాయి బ్రూటల్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను షాక్ ఇవ్వబోతున్నాడు.

  Last Updated: 19 Jun 2025, 12:18 PM IST