పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘OG’ సినిమాకు సంబంధించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సుజీత్ (Sujeet) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, పవన్ రాజకీయ బాధ్యతల కారణంగా ఆలస్యమైంది. అయితే తాజాగా మేకర్స్ కేజ్రీ అప్‌డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 25, 2025న ‘OG’ను దసరా (Dasara) కానుకగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది. “మనల్ని ఎవడ్రా ఆపేది!” అనే పవన్ మార్క్ డైలాగ్‌లా అభిమానుల జోష్ పెంచింది.
ఇక ఇదే సమయంలో టాలీవుడ్‌లో థియేటర్ల అంశం, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిన వేళ ఈ అప్‌డేట్ రావడం అభిమానుల్లో ఆసక్తిగా మారింది. మెగా నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ జరుగుతుండగానే OG రిలీజ్ డేట్ బాంబ్ వేసింది. ఇప్పటికే దసరా సీజన్‌కు నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ‘అఖండ 2’, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’, మరికొన్ని డబ్బింగ్ సినిమాలు రిలీజ్ డేట్‌లను లాక్ చేసుకున్నాయి. ఇప్పుడు OG ఆ డేట్‌ను చేసుకోవడంతో ఇతర సినిమాలకు షెడ్యూల్ మారే అవకాశాలు పెరిగాయి.
పవన్ సినిమాల కోసం అభిమానుల క్రేజ్ తెలిసిన విషయమే. దాంతో అదే డేట్ ను లాక్ చేసిన ఇతర సినిమాల నిర్మాతలు ఇప్పుడు తలపట్టుకుంటున్నారంటూ టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ముఖ్యంగా బాలయ్య సినిమా OGకి తలపడుతుందా? లేదా పవన్‌కు మార్గం క్లియర్ చేస్తారా? అన్నది ఇప్పుడు హాట్ డిబేట్‌గా మారింది. ఏదేమైనా పవన్ తిరిగి బిగ్ స్క్రీన్ మీద సందడి చేయబోతుండటం ఫ్యాన్స్‌కి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.